Minor Girl: చదువుకునే వయస్సులో ఇదేం దుర్మార్గపు ఆలోచన.. పాపం ఆ బాలిక పరిస్థితి..

బాధిత మహిళ కుటుంబసభ్యులు

Minor Girl: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని శంకరగిరి తండాలో ఆరేళ్ళ చిన్నారిపై అదే తండాకు చెందిన 8వ తరగతి చదివే విద్యార్థి అత్యాచారయత్నం చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  మన దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు(Murder), అత్యాచారాలు(Rape) ఆగడం లేదు. నిర్భయ (Nirbhaya) , దిశ (Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా… కొందరు రాక్షసుల్లో మార్పు రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు (gang rape) ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియా (Sociral Media) లో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.

  Crime News: ఈ మహిళ పోరాడి అనుకున్నది సాధించింది.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయింది..


  ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని శంకరగిరి తండాలో ఆరేళ్ళ చిన్నారిపై అదే తండాకు చెందిన 8వ తరగతి చదివే విద్యార్థి అత్యాచారయత్నం చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని శంకరగిరి తండాలో ఆరేళ్ళ చిన్నారి తన ఇంటి ఎదుట ఆడుకుంటోంది.

  Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు నిదర్శం ఈ ఘటన.. మంత్రి ఏమన్నారంటే..


  ఆ బాలికకు అదే తండాకు చెందిన 8వ తరగతి చదివే విద్యార్థికి మాయమాటలు చెప్పాడు. ఆ సమయంలో ఆ బాలిక తల్లదండ్రలు పొలం పనికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి అత్యాచారయత్నం చేశాడు. చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళొచ్చాక పాప విషయాన్ని వివరించడంతో ఆగ్రహంతో ఆ బాలుడిని నిలదీశారు.

  Huzurabad By Elections: షాకిస్తున్న సర్వేలు.. అనూహ్యంగా మారుతున్న సమీకరణాలు.. ఆ అభ్యర్థికి ఓటమి తప్పదా..?


  అనంతరం ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.

  మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
  Published by:Veera Babu
  First published: