హోమ్ /వార్తలు /క్రైమ్ /

తమిళనాడులో దారుణం... పొరపాటున కాలు తగిలిందని... ప్రాణాలు తీసేశాడు...

తమిళనాడులో దారుణం... పొరపాటున కాలు తగిలిందని... ప్రాణాలు తీసేశాడు...

వీధినాటకం చూస్తుండగా గొడవ... కాలు తగిలినందుకు ఇద్దరు తాగుబోతుల మధ్య వాగ్వాదం... కత్తితో దాడి...

వీధినాటకం చూస్తుండగా గొడవ... కాలు తగిలినందుకు ఇద్దరు తాగుబోతుల మధ్య వాగ్వాదం... కత్తితో దాడి...

వీధినాటకం చూస్తుండగా గొడవ... కాలు తగిలినందుకు ఇద్దరు తాగుబోతుల మధ్య వాగ్వాదం... కత్తితో దాడి...

  పొరపాటున కాలు తగిలిందని... ఓ వ్యక్తిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేస్తోంది. నామక్కల్ జిల్లా పల్లిపాళయం సమీపంలో ఏర్పాటు చేసిన వీధినాటకం... ఈ హత్యకు వేదికైంది. అగ్రహారం గ్రామానికి చెందిన 30 ఏళ్ల కార్తీక్... మేస్త్రీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కార్తీక్ చాలాకాలం క్రితమే పెళ్లైయినప్పటికీ... మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అగ్రహారానికి సమీపంలో కొట్టైకాడులో మరియమ్మ ఆలయంలో జరుగుతున్న తిరునాళ్ల జాతరకు వెళ్లాడు కార్తీక్.

  తిరునాళ్లలో వీధినాటకం జరుగుతుండడంతో చూడడానికి వెళ్లాడు కార్తీక్. ఆ సమయంలో అతను ఫుల్లుగా తాగి ఉన్నాడు. అక్కడికి వచ్చిన భగత్ సింగ్ అనే వ్యక్తి, కార్తీక్ పక్కనే నిలబడి నాటకం చూస్తున్నాడు. అతను కూడా మద్యం తాగి ఉన్నాడు. వెనక్కి వెళ్లే సమయంలో భగత్ సింగ్ కాలు, పొరపాటున కార్తీక్‌కు తగిలింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కాలు తగిలిందని సారీ చెప్పాలని కార్తీక్, భగత్ సింగ్‌ను నిలదీశాడు. భగత్ సింగ్ మాత్రం సారీ చెప్పేది లేదని తెగేసి చెప్పాడు. దాంతో కార్తీక్, భగత్ సింగ్‌ను కొట్టాడు. తీవ్ర ఆవేశానికి లోనైన భగత్ సింగ్... అక్కడే ఉన్న మటన్ కొట్టు వ్యాపారి వద్దకి వెళ్లి కత్తి లాక్కుని... కార్తీక్‌పై దాడి చేశాడు. కత్తిపోటుతో బాధపడుతున్న కార్తీక్‌ను స్థానికులు... హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తీక్ చనిపోయాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... భగత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

  ఇవి కూడా చదవండి...

  ‘దొంగ డ్యాన్సర్’... పగలు డ్యాన్స్ షోలు... రాత్రిళ్లు ఇళ్లల్లో చోరీలు...


  మంచులో చిక్కుక్కున్న 3వేల మంది టూరిస్టులు... కాపాడిన ఆర్మీ సాయం...


  ప్రేమకి మతం మకిలీ... ఒకే తాడుకి ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య...


  మీ ఫోన్‌లో ‘ఆ వీడియోలు’ ఉన్నాయా... అయితే జైలుకి వెళ్లక తప్పదు...


  దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...


  భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...


  చలి తట్టుకోలేక మంచం కింద హీటర్ పెట్టుకున్నారు... నిప్పంటుకుని...


  8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

  First published:

  Tags: Crime

  ఉత్తమ కథలు