హోమ్ /వార్తలు /crime /

చలి తట్టుకోలేక మంచం కింద హీటర్ పెట్టుకున్నారు... నిప్పంటుకుని...

చలి తట్టుకోలేక మంచం కింద హీటర్ పెట్టుకున్నారు... నిప్పంటుకుని...

పంజాబ్ రాష్ట్రంలోని సమ్రలా పరిధిలో గత బఘౌర్ గ్రామంలో విషాదం... హీటర్‌ వల్ల నిప్పంటుకుని ఇద్దరి సజీవ దహనం...

పంజాబ్ రాష్ట్రంలోని సమ్రలా పరిధిలో గత బఘౌర్ గ్రామంలో విషాదం... హీటర్‌ వల్ల నిప్పంటుకుని ఇద్దరి సజీవ దహనం...

పంజాబ్ రాష్ట్రంలోని సమ్రలా పరిధిలో గత బఘౌర్ గ్రామంలో విషాదం... హీటర్‌ వల్ల నిప్పంటుకుని ఇద్దరి సజీవ దహనం...

  చలి రోజురోజుకీ పెరిగిపోతోంది. చలి తట్టుకోలేక... వేడి కోసం రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు జనాలు. అలా చలి తట్టుకోలేక వేడి కోసం మంచి కింద హీటర్ పెట్టుకున్న ఇద్దరు స్నేహితులు... మంటలు అంటుకోవడంతో సజీవదహనమయ్యారు. పంజాబ్‌లో జరిగిన ఈ విషాద సంఘటన... స్థానికంగా కలవరం సృష్టించింది. పంజాబ్ రాష్ట్రంలోని సమ్రలా పరిధిలో గత బఘౌర్ గ్రామంలో లఖ్వీర్ సింగ్ అనే 40 ఏళ్ల వ్యక్తి, లాల్ సింగ్ అనే 55 ఏళ్ల వ్యక్తి... ఇద్దరూ స్నేహితులు. చాలా ఏళ్ల క్రితమే భార్యాపిల్లలతో గొడవ పడి... ఇంటికి దూరంగా ఒకే గదిలో నివాసం ఉంటున్నారు ఈ ఇద్దరూ.

  కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ స్నేహితులు... చలి బాగా పెరగడంతో వేడి కోసం మంచం కింద హీటర్ పెట్టుకున్నారు. హీటర్ పెట్టిన విషయం మరిచిపోయి నిద్రలోకి జారుకున్నారు. హీటర్ వేడి పెరగడంతో మంచానికి నిప్పు అంటుకుంది. వారి ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు స్పందించి... వచ్చి చూసేసరికి ఇద్దరూ అప్పటికీ సజీవదహనమై కనిపించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు. చలి నుంచి తప్పించుకునేందుకు ఇలా లేనిపోని పద్ధతులు ఎంచుకోవడంతో ఈ మధ్య ప్రమాదాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ ఇంట్లో చలి తట్టుకోలేక బొగ్గుల కుంపటి పెట్టుకుని... తల్లీకొడుకు చనిపోగా... కోళ్లఫారంలో నలుగురు యువకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

  ఇవి కూడా చదవండి...

  దుబాయ్‌‌లో రోడ్డుప్రమాదం... భార్య శవం కోసం రూ. 40 లక్షలు చెల్లించిన భర్త...

  భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...

  బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

  కోతికి చక్కలిగింతలు పెట్టినందుకు మూడు సంవత్సరాలు జైలు.. ఎక్కడో తెలుసా...!

  8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

  First published:

  ఉత్తమ కథలు