మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...

దాదాపు 100 రోజుల విచారణ తర్వాత ‘తులసి మొక్క కింద శవం’ వెనక అసలు గుట్టు కనుగొన్న పోలీసులు... కూతురు వరుసయ్యే అమ్మాయ మీద మోజుతో మేనల్లుడిని చంపేసిన మామ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 6:13 PM IST
మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...
తులసీ మొక్క (నమూనా చిత్రం)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 6:13 PM IST
సర్వరోగ నివారిణి తులసి. అందుకే ప్రతి ఇంట్లో ఓ తులసి మొక్కను పెంచుకోవాలని వేదాలు చెబుతున్నాయి. తులసి మొక్కను దేవతగా పూజించి, పూజలు కూడా చేస్తుంటారు చాలామంది. అయితే అలాంటి పవిత్రమైన తులసి మొక్కను ఉపయోగించి, హత్యానేరం నుంచి తప్పించుకోవాలని చూశాడో యువకుడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని డాబ్రీ ప్రాంతంలో దాదాపు మూడు నెలల క్రితం... ఓ ఇంట్లో తులసి మొక్క కింద మానవ అస్థిపంజరం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ అస్థిపంజరం ఎవ్వరిదీ, అక్కడికి ఎలా వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 100 రోజుల విచారణ తర్వాత ‘తులసి మొక్క కింద శవం’ వెనక అసలు గుట్టు కనుగొన్నారు. తులసి మొక్క కింద లభించిన మృతదేహం జయప్రకాశ్ మహారాణా అనే 27 ఏళ్ల యువకుడిగా గుర్తించిన పోలీసులు... అతన్ని హత్య చేసి అక్కడ పాతిపెట్టి ఉంటారని అనుమానించారు.

అయితే అస్థిపంజరం బయట పడిన సమయం నుంచి మృతుడి మేనమామ విజయన్ మహారాణా ఆచూకీ కూడా లేకపోవడంతో అతనే చంపి ఉంటాడని అనుమానించిన పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు హైదరాబాద్‌ నగరంలో అతన్ని పట్టుకున్నారు పోలీసులు. జయప్రకాశ్ మహారాణా ప్రేయసితో మేనమామ విజయన్‌కు పరిచయం ఏర్పడిందని, దాంతో ఆమెను దక్కించుకునేందుకు అడ్డుగా ఉన్న మేనల్లుడిని చంపేసినట్టు తేల్చారు. అల్లుడిని చంపిన తర్వాత శవాన్ని మాయం చేసేందుకు... మృతదేహాన్ని పాతిపెట్టి పైన ఓ తులసి మొక్కను నాటాడు. అయితే గుంత ఎక్కువ లోతు తీయకపోవడంతో కొన్నాళ్లకు అస్థిపంజరం పైకి తేలి కనిపించింది. ఇంట్లో అస్థిపంజరం కనిపించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు... పోలీసులకు సమాచారం అందించారు. 2018, అక్టోబర్ 9న ఇంట్లో అస్థిపంజరం బయటపడింది. అంతకుముందు దాదాపు మూడు నెలల ముందే మేనల్లుడిని చంపేసి... అతని ప్రేయసితో చనువుగా ఉండడం మొదలెట్టినట్టు పోలీసులకు తెలిపాడు విజయన్. వరుసకు కూతురు అయ్యే అమ్మాయితో ప్రేమ కోసం మేనల్లుడినే చంపిన విజయన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... ఈ హత్యతో జయప్రకాశ్ ప్రేయసికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

గుల్బర్గా బస్టాప్‌లో ‘లైవ్ మర్డర్’... కత్తులతో పొడుస్తున్నా స్పందించని జనం... వైరల్ వీడియో...
‘ఖాకీ జూదం’... పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన పోలీసులు...


ఎటిఎంలో పరిచయమయ్యాడు... యువతిని మాటల్లో పెట్టి దోచేశాడు...


‘ముద్దుగా ఉన్నావ్... ఓ ముద్దు ఇవ్వవా’... విద్యార్థినికి 50 ఏళ్ల ‘నీచపు టీచర్’ మెసేజ్...

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...