హోమ్ /వార్తలు /క్రైమ్ /

భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...

భర్త పొలం పనులకు వెళ్లగానే ప్రియుడితో సరసం... విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే...

నమూనా చిత్రం

నమూనా చిత్రం

ఏడాదిగా భర్తను మోసం చేస్తున్న భార్య... మధ్యాహ్నం ఇంటికి రావడంతో వెలుగుచూసిన అసలు స్వరూపం... బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సంఘటన...

అతనో రైతు. రోజూ ఉదయాన్నే లేచి... పొలం పనుల నిమిత్తం సెలకకు వెళ్లేవాడు. పొలంలో ఆ పనీ, ఈ పనీ చేస్తూ రాత్రి ఎప్పటికీ ఇంటికి చేరుకునేవాడు. అయితే ఓ రోజు ఏదో పని మీద మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి... గుండె ఆగినంత పనైంది. తన భార్య, మరోకరితో కలిసి శృంగారం సాగిస్తుండడం చూసి... తట్టుకోలేక తలుపులు వేసి, చుట్టుపక్కలవారిని పిలిచి అందరి ముందు ఆమె గుట్టురట్టు చేశాడు. అయితే ప్రియుడితో సరససల్లాపాల విషయం బయటపడడంతో ఓపెన్ అయిపోయిన ఆమె... అతనితోనే ఉంటానంటూ తెగేసి చెప్పడం విశేషం. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన బీహార్‌లో జరిగింది.

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని భోరె పరిధిలో మహారాదేవుర్ గ్రామానికి చెందిన ఓ యువతికి, బగ్హవా గ్రామానికి చెందిన యువకుడితో ఈ ఏడాదే వివాహం జరిగింది. పెళ్లైన రోజు భార్యాభర్తలిద్దరూ సఖ్యంగానే ఉంటున్నారు. భర్త రైతు కావడంతో రోజూ ఉదయాన్నే పొలంపనుల నిమిత్తం వెళ్లిపోయేవాడు. అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా పొలానికి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి తన మెట్టింట్లోనే శారీరక సంబంధం కొనసాగించేది. దాదాపు ఏడాదిగా తన ప్రియుడితో లైంగిక సంబంధం నడుపుతున్నప్పటికీ విషయం బయటికి రాలేదు. శుక్రవారం పొలానికి వెళ్లిన భర్త, ఏదో పని మీద మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. తన భార్య, ఇంట్లో మరో వ్యక్తితో సంబంధం సాగిస్తుండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే తలుపుకి గడియ పెట్టి, చుట్టుపక్కలవారందరికీ పిలిచి ఆమె గుట్టు రట్టు చేశాడు. అందరి ముందు అతన్ని, ఆమెనూ ప్రశ్నించగా... తాము ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నామని, పెళ్లి తర్వాత కూడా ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోతున్నామని ఒప్పుకున్నారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడా భర్త.

ఇవి కూడా చదవండి...

బాలికపై అత్యాచారం, హత్య..మాజీ ఎమ్మెల్యేకి పదేళ్లు జైలు

కోతికి చక్కలిగింతలు పెట్టినందుకు మూడు సంవత్సరాలు జైలు.. ఎక్కడో తెలుసా...!

8 ఏళ్ల బాలికపై రేప్... అత్యాచారానికి ఒడిగట్టిన ‘క్లాస్‌మేట్స్’...

First published:

Tags: Crime

ఉత్తమ కథలు