కాకినాడలో ఏడేళ్ల చిన్నారి అదృశ్యం... కిడ్నాప్ చేసిన సవతి తల్లి

దీప్తిశ్రీ స్థానిక నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శుక్రవారం పాప స్కూల్‌కు వెళ్లిన సమయంలోనే మధ్యాహ్నం పాప కిడ్నాప్ అయినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

news18-telugu
Updated: November 24, 2019, 10:57 AM IST
కాకినాడలో ఏడేళ్ల చిన్నారి అదృశ్యం... కిడ్నాప్ చేసిన సవతి తల్లి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాకినాడలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టిస్తుంది. సూరాడ దీప్తిశ్రీ అనే చిన్నారిని చదువుకునే స్కూల్‌లోనే కిడ్నాప్‌కు గురైంది. దీంతో బాలిక తండ్రి సత్యశ్యామ్‌కుమార్‌ కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాకినాడ -యానాం రోడ్డులో పగడాల పేటకు చెందిన శ్యామ్‌కుమార్‌ భార్య, దీప్తిశ్రీ తల్లి సత్యవేణి కొంతకాలం క్రితం చనిపోయింది. అయితే దీప్తి అనంతరం కొంతకాలానికి సత్యశ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు. అయితే శాంతికుమారి సవతి తల్లి కావడంతో ఆమెకు దీప్త అంటే ఇష్టం లేదు. దీంతో కోడలే తన మనవారాల్ని కిడ్నాప్ చేసిందని నాయననమ్మ అనుమానం వ్యక్తం చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాప సవతి తల్లి శాంతికుమారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పోలీసుల విచారణలో శాంతికుమారి నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది.దీప్తిశ్రీ స్థానిక నగర పాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. శుక్రవారం పాప స్కూల్‌కు వెళ్లిన సమయంలోనే మధ్యాహ్నం ఓ మహిళ వచ్చి దీప్తిశ్రీని పాఠశాల నుంచి బయటకు తీసుకువచ్చి వేరే వ్యక్తితో బండి మీద ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు సత్యశ్యామ్‌కుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా కిడ్నాప్‌ చేసిన వ్యక్తులు బాలికను చంపివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 24, 2019, 10:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading