ఇంట్లో ఒంటరిగా కూతురు.. గదిలోకి అతన్ని పంపిన సవతి తల్లి.. చివరికిలా..!

పున్నమ్మ మృతి తర్వాత వరంగల్‌కి చెందిన దుర్గను మొగులయ్య రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం మొగులయ్య పెద్ద కూతురికి స్థానికంగా ఉండే ఓ యువకుడితో పెళ్లి జరిపించారు. ఇక రెండో కూతురు కూడా పెళ్లికి ఎదగడంతో.. దుర్గలో దుర్మార్గపు ఆలోచనలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: May 9, 2019, 8:59 AM IST
ఇంట్లో ఒంటరిగా కూతురు.. గదిలోకి అతన్ని పంపిన సవతి తల్లి.. చివరికిలా..!
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 9, 2019, 8:59 AM IST
హైదరాబాద్‌లోని మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ మహిళ తన సవతి కూతురిపై బంధువుతో లైంగిక దాడి చేయించింది. ప్లాన్ ప్రకారం కూతురిపై అతన్ని ఉసిగొల్పింది. చివరకు ఆమె గర్భం దాల్చి విషయం తండ్రికి తెలియడంతో.. నష్టపరిహారం పేరుతో మరో డ్రామా ఆడింది. తిరిగి ఆ డబ్బులు కూడా తానే కాజేయాలని ప్లాన్ చేసింది. సవతి తల్లి కుట్రలు, వేధింపులకు తాళలేక చివరకు ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. నల్గొండకు చెందిన గోగుల మొగులయ్య-పున్నమ్మ దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. బతుకుదెరువు కోసం చాలా ఏళ్ల క్రితమే మొగులయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. మీర్‌పేట లెనిన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఆరేళ్ల క్రితం అతని భార్య పున్నమ్మ అనారోగ్యంతో చనిపోయింది.

పున్నమ్మ మృతి తర్వాత వరంగల్‌కి చెందిన దుర్గను మొగులయ్య రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రెండేళ్ల క్రితం మొగులయ్య పెద్ద కూతురికి స్థానికంగా ఉండే ఓ యువకుడితో పెళ్లి జరిపించారు. ఇక రెండో కూతురు కూడా పెళ్లికి ఎదగడంతో.. దుర్గలో దుర్మార్గపు ఆలోచనలు మొదలయ్యాయి. పెళ్లి చేస్తే కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుందన్న ఆలోచనతో.. తనకు వరుసకు మేనమామ అయిన మల్లేష్(34) అనే వ్యక్తిని కూతురిపై ఉసిగొల్పింది.

యువతిని ఇంట్లో ఒంటరిగా ఉంచి దుర్గ బయటకు వెళ్తుండేది. దీంతో మల్లేష్ ఇంటికొచ్చి ఐస్‌క్రీమ్‌లో మత్తు మందు కలిపి ఓరోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. మొగులయ్య మల్లేష్‌ను నిలదీయగా.. రూ.1.50లక్షలు నష్టపరిహారానికి ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మల్లేష్ ఉండే మిర్యాలగూడకు వెళ్లి మంగళవారం రూ.50వేలు తీసుకున్నారు. హైదరాబాద్ బయలుదేరాక.. మొగులయ్యకు చిన్న కూతురి నుంచి ఫోన్ వచ్చింది. అక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలపడంతో అతను బోరున విలపించాడు.హత్యే అంటున్న బంధువులు..

మల్లేశ్ వద్ద నుంచి రూ.50వేలు తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు.. దుర్గ ఆమె చెల్లెలు నాగమణికి ఫోన్ చేసిందని మొగులయ్య బంధువులు అంటున్నారు. మల్లేశ్ ఇచ్చిన రూ.50వేలు తమకే దక్కాలంటే యువతిని హతమార్చాలని నాగమణికి సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ప్లాన్ ప్రకారం నాగమణిని హత్య చేశారని ఆరోపించారు. వారి ఫిర్యాదుతో దుర్గ, ఆమె చెల్లెలు నాగమణిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...