చిన్న తనంలో ఎంతో మంది స్నేహితులు (Friends) ఉంటారు. వాళ్లంతా కొంత వయస్సు(Age) వచ్చిన తర్వాత అదే స్నేహాన్ని కొనసాగిస్తారా లేదా అనేది చెప్పలేం. అయితే కొంతమంది మాత్రం అదే స్నేహ బంధాన్ని కొనసాగిస్తారు. పెళ్లిళ్లు అయినా కూడా ఆ బంధాన్ని విడవలేరు. ఇలా ఇద్దరు స్నేహితులు చిన్న తనం నుంచి స్నేహంగా ఉండేవారు. అందులో ఒకడికి వివాహం అయింది. మరొకరికి కాలేదు. వివాహం అయిన స్నేహితుడి ఇంటికి అతడు తరచూ వస్తుండేవాడు. అంతే కాదు.. అతడి భార్యతో చనువు పెంచుకొని.. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాడు. స్నేహితుడే కదా అని అతడు లైట్ తీసుకున్నాడు. అదే చివరకు అతడి కొంప ముంచుతుందని అనుకోలేదు.
ఇలా అతడు ఏ చిన్న పని లేకున్నా ఇంటికి వచ్చి మాట్లాడటం.. ఫోన్లలో కూడా వాళ్లిద్దరు టచ్ లో ఉండటం గమనించాడు. దీంతో తన భార్యపై అనుమానం పెంచుకొని.. అతడి ఫ్రెండ్ ను కూడా మందలించాడు. ఇద్దరు వినకపోవడంతో మనస్తాపం చెందాడు. చివరకు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని పీహెచ్ఈ కాలనీకి చెందిన అక్షయ్ సోంకున్వార్ అలియాస్ గోలు (26) బల్లభ్ భవన్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా పని చేసేవాడు. గోలుకు చిన్నతనం నుంచే సాగర్ అనే వ్యక్తి స్నేహితుడిగా ఉన్నాడు.
ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఎవరి ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా ఇద్దరు వెళ్లేవారు. ఇందులో గోలుకు ఇటీవల వివాహం కూడా అయింది. ఇద్దరి మధ్య స్నేహం ఉండటంతో అదే చనువుతో అక్షయ్ ఇంటికి వెళుతూ ఉండేవాడు సాగర్. అక్కడ అక్షయ్ భార్య సుధా(23)తో సాగర్ సన్నిహితంగా ఉండేవాడు. ఆమెతో మాట్లాడుతూ.. అప్పుడప్పుడు జోక్స్ వేసుకుంటూ ఉండేవారు. అక్షయ్ మాత్రం తన ఫ్రేండే కదా అని సాగర్ ను పట్టించుకునే వాడు కాదు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న సాగర్ ఆమెతో ప్రేమయాణం సాగించాడు. కొన్ని రోజుల తర్వాత సుధపై అక్షయ్ కు అనుమానం వచ్చింది. ఆమెను అనుమానంతో నిలదీయడం మొదలు పెట్టాడు. ఇలా ఆమెను నిలదీస్తూ.. ప్రతీ సారి వేధించడం మొదలు పెట్టాడు.
ఈ విషయంపై తాను సాగర్ కు చెబుతా అంటూ ఆమె బెదిరించడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి అతడు ఎక్కువగా మనస్తాపానికి గురయ్యాడు. తన భార్యని వదిలిపెట్టమని ఫ్రెండ్ని కూడా అడిగాడు. అయినా సాగర్ అతడి మాట వినలేదు. దీంతో అతడు ఎంతో బాధపడ్డాడు. ఇటు భార్య మాట వినక.. చిన్న తనం నుంచి స్నేహితుడు అనుకున్న వ్యక్తి మోసం చేయడంతో.. తట్టుకోలేక అతడు ఇంట్లోని గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు చనిపోయిన మరుసటి రోజు అతన భార్య సుధా కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ దంపతులకు ఐదేళ్ల కొడుకు మీరాన్ష్, అక్షయ్ తల్లి కుసుమ్ భాయ్ అనాథలయ్యారు. దీంతో ఆమె మనవుడిని పోషించడం కష్టంగా ఉందని.. తీవ్ర ఆవేదనకు గురైంది. భర్త కూడా తోడు లేకపోవడంతో.. ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి నెలకొందని వాపోయింది కుసుమ్ భాయ్. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news