Home /News /crime /

STALKERS ARE TRACK WOMAN BY USING WHATSAPP ONLINE STATUS TRACKER WEBSITES TO GET INFORMATION GH SRD

WhatsApp : అమ్మాయిలు మీరు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా..? అయితే, మీ సమాచారం వాళ్ల చేతుల్లోకి..

అమ్మాయిలు మీరు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా..? అయితే, మీ సమాచారం వాళ్ల చేతుల్లోకి..

అమ్మాయిలు మీరు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా..? అయితే, మీ సమాచారం వాళ్ల చేతుల్లోకి..

WhatsApp : అస‌లు విష‌యం ఏంటంటే, ఇలాంటి పోకిరీ యాప్‌ల‌ను వాట్సాప్ నిలువ‌రించ‌లేదు. దానికి కార‌ణం ఇట్లాంటి వాటిని మానిట‌ర్ చేసే సెట్టింగ్స్ అందులో లేక‌పోవ‌డ‌మే. దీని వ‌ల్ల యూజ‌ర్లు వారి స‌మాచారాన్ని ఎవ‌రైనా ట్రాక్ చేస్తున్నారా లేదా అనే విష‌యాన్ని తెలుసుకోలేరు.

ఇంకా చదవండి ...
టెక్నాల‌జీ పెరిగిన కొద్దీ జాగ్ర‌త్త‌లూ మ‌రింత పెర‌గాలి. మ‌న గురించి మ‌న‌కంటే ఇంట‌ర్నెట్‌కే ఎక్కువ తెలుస్తున్న రోజుల్లో బ‌తుకుతున్నాం కాబ‌ట్టి ఏమ‌రుపాటుగా ఉండ‌కూడ‌దు. ఎందుకంటే, వాట్సాప్‌లో ఆడ‌పిల్ల‌ల ఆన్‌లైన్ స్టేట‌‌స్‌ను బ‌ట్టి స్టాక‌ర్లు, సైబ‌ర్ అటాక‌ర్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్‌కున్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌పంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ దీనికి అంత‌ర్జాతీయంగా మిలియ‌న్ల కొద్దీ వినియోగ‌దారులున్నారు. అందులో భార‌త‌దేశం దీనికి చాలా పెద్ద మార్కెట్‌. అయితే ఈ యాప్ లో కొన్ని లోపాలు ఉండ‌టం కార‌ణంగా వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త స‌మాచారం స్టాకర్ల చేతుల్లో ప‌డే అవ‌కాశం ఉంది. ఇదే విష‌యాన్ని ఇంట‌ర్నెట్ భ‌ద్ర‌తా ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేశారు.ట్రేసర్లు, స్టాక‌ర్లు, సైబ‌ర్ దాడులు చేసేవారు వాట్సాప్ ఆన్‌లైన్ స్టాట‌స్ ట్రాక‌ర్ వెబ్‌సైట్లు, యాప్‌లను నిర్వ‌హిస్తున్న‌ట్లు తాజా ప‌రిశోధ‌న‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. వీరంతా వాట్సాప్ వినియోగ‌దారుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని వాడుకుంటున్నారు. ఇంకా అనేక చ‌ట్ట‌ వ్య‌తిరేక కార్య‌కలాపాల‌కు ఈ స‌మాచారం వినియోగిస్తున్న‌ట్లు ఇందులో తెలిసింది. అంతేకాదు, వాట్సాప్ వినియోగ‌దారులు ఎవ‌రు ఎవ‌రికి టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతున్నారో కూడా ట్రాక్ చేస్తున్న‌ట్లు క‌నుగొన్నారు. ఇదెలాగోన‌నే సందేహం రావ‌చ్చు... వాట్సాప్‌లో ఎవ‌రైనా ఆన్‌లైన్‌ లోకి రాగానే వారి ప్రొఫైల్ వారు ఆన్‌లైన్లో ఉన్న‌ట్లు చూపిస్తుంది. దీన్ని ఏ యూజ‌ర్ అయినా చూడొచ్చు. ఒక‌వేళ నువ్వు ఆ యూజ‌ర్ నెంబ‌రు సేవ్ చేసుకోక‌పోయినా ఆన్‌లైన్ స్టేట‌‌స్ క‌నిపిస్తుంది. ఈ స‌మాచారాన్ని ఎవ‌రైనా గుర్తించ‌వ‌చ్చు. స‌రిగ్గా దీన్నే స్టాక‌ర్లు వినియోగించుకుంటున్నారు. నిజానికి వాట్సాప్ స్టేట‌స్ స్టాక‌ర్లు వాట్సాప్‌లోని వినియోగ‌దారుల‌ను నిరంతరాయంగా గ‌మ‌నిస్తూనే ఉన్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా?! కానీ అది నిజం.

సిటిఓ మాట్ బోడ్డీ కొన్ని వాట్సాప్ ఆన్‌లైన్ ట్రాక‌ర్ల‌ను వినియోగించిన‌ట్లు తెలిసింది. ఇది వినియోగ‌దారుడు క‌చ్చితంగా ఏ రోజు, ఎన్ని గంటల‌కు ఆన్‌లైన్‌లో ఉన్నాడో చూపిస్తుంది. ఇంకా సుల‌భంగా అర్థం కావాలంటే, ఈ స్టేట‌స్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల‌ల్లో ఏదైనా వాట్సాప్ నెంబ‌రు ఎంట‌ర్ చేస్తే చాలు, ఆ వ్య‌క్తి వాట్సాప్‌లోకి క‌చ్ఛితంగా ఎప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చారు.. ఎంత సేపు ఉన్నాడ‌నే స‌మాచారాన్ని చెప్పొచ్చు. అయితే, ఇలాంటి వైబ్‌సైట్లు, యాప్‌లు ఎలా ప‌నిచేస్తాయో, ఏంటో ఈ రిపోర్టులో తెలియ‌జేశారు కానీ అవి ఎక్కువ‌ ప్ర‌చారం పొంద‌కూడ‌ద‌నే ఉద్దేశంతో వాటి పేర్ల‌ను ఇందులో ప్ర‌స్తావించ‌లేదు.

ఇందులో బ‌య‌ట‌ప‌డిన విష‌యాల‌ను గ‌మ‌నిస్తే, `మోసం చేస్తున్న జీవిత భాగ‌స్వాముల‌ను, పార్ట‌న‌ర్లను క‌నిపెడ‌తామ‌నే` పేరుతో ఇలాంటి యాప్‌లు వ‌స్తున్నాయి. వీటిల్లో ఒక యాప్ ఏం చెబుతుందో చూడండి...`మీకు జీవిత భాగస్వామిపైన‌గానీ లేదంటే, బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ పైన‌గానీ ఏదైనా అనుమానం ఉంటే ‌వాట్సాప్ లాస్ట్ సీన్ ట్రాక‌ర్ మీ అనుమానం నిజ‌మో కాదో ఇట్టే చెప్పేస్తుంది`. ఇంకో యాప్‌ని చూస్తే, `త‌ల్లిదండ్రులకు త‌మ పిల్ల‌ల స్టేట‌స్ అప్‌డేట్‌లు తెలియ‌జేస్తుంది`. దీన్ని బ‌ట్టి ట్రాక‌ర్లు `ఒక వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఉన్నాడు, ఎవ‌రికి టెక్స్ట్ చేశారు` అనేది తెలుసుకోవ‌డానికి వీటిని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి యాప్‌లు బాధితుల డివైజ్‌లో కాకుండా స్టాక‌ర్ల డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అందులో మీరు ఎవ‌రిపై నిఘా పెట్టాల‌నుకుంటున్నారో వారి వాట్సాప్ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అలాగే వాళ్లు ఎవ‌రితో చాటింగ్ చేస్తున్నార‌ని అనుమానం ఉందో ఆ నెంబ‌రును కూడా ఎంట‌ర్ చేస్తే, ఈ రెండు నెంబ‌ర్లు ఒక‌రితో ఒక‌రు సంభాషించుకున్నారో లేదో అనే వివ‌రాలు వ‌చ్చేస్తాయి.

ఇలాంటి ట్రాక‌ర్ యాప్‌లు గూగుల్ ప్లేలో ఇంత సులువుగా ఎలా అందుబాటులోకి ఉన్నాయ‌నే ప్ర‌శ్న‌కు ఈ స‌ర్చ్ జైంట్ చెబుతున్న స‌మాధానం ఏంటో తెలుసా `త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ట్రాక్ చేయ‌డానికి వీటికి అనుమతి ఉంది. అయితే వీటికి ఒక వ్య‌క్తిని, అంటే ఉదాహ‌ర‌ణ‌కి జీవిత భాగ‌స్వామిని, త‌నకు తెలియ‌కుండా, త‌న అనుమ‌తి లేకుండా, లేక‌పోతే నిరంత‌రం నోటిఫికేష‌న్లు పంప‌కుండా డాటాను ట్రాన్స్‌మీట్ చేసుకోకూడ‌ద‌ని` చెబుతున్నారు. ఇలాంటి యాప్‌లకే కాదు, ఈ ప‌నులు చేసే వెబ్‌సైట్ల‌కీ ప్లే స్టోర్‌ల నుంచి ఎలాంటి అప్రూవ‌ళ్లు గానీ, క‌చ్చిత‌మైన రివ్యూ ప్రాసెస్‌లు కానీ లేవు. అవి అక్క‌డ అందుబాటులో ఉంటాయంతే!

అస‌లు విష‌యం ఏంటంటే, ఇలాంటి పోకిరీ యాప్‌ల‌ను వాట్సాప్ నిలువ‌రించ‌లేదు. దానికి కార‌ణం ఇట్లాంటి వాటిని మానిట‌ర్ చేసే సెట్టింగ్స్ అందులో లేక‌పోవ‌డ‌మే. దీని వ‌ల్ల యూజ‌ర్లు వారి స‌మాచారాన్ని ఎవ‌రైనా ట్రాక్ చేస్తున్నారా లేదా అనే విష‌యాన్ని తెలుసుకోలేరు. అయితే వాట్సాప్‌లో `లాస్ట్ సీన్‌` ను క‌నిపించ‌కుండా చేసుకునే హైడ్ ఆప్ష‌న్ ఉంది కానీ మీరు యాప్‌ని ఉప‌యోగిస్తున్న‌ప్పుడు అక్క‌డ క‌నిపించే `ఆన్‌లైన్` స్టేట‌స్ మీరు హైడ్ చేయ‌లేరు. వాట్సాప్ విష‌యంలో ఇది పెద్ద లోపంగా చెప్పొచ్చు.

వాట్సాప్ వినియోగ‌దారుల సున్నితమైన స‌మాచారం చాలా భ‌ద్రంగా ఉంచుతామ‌ని చెబుతున్నాఅది ఆన్‌లైన్ ట్రాకింగ్ విష‌యంలో ఏమీ చేయ‌లేక‌పోతుంది. అందుకే తెలియ‌ని కాంటాక్ట్‌ల నుంచి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వ‌‌లేని వాట్సాప్‌ని భ‌ద్ర‌తా ప‌రిశోధ‌కులు విమ‌ర్సిస్తున్నారు. ఇది వాట్సాప్‌లో ఉన్న అల‌స‌త్వానికి ప్ర‌తీక‌గా చెబుతున్నారు. ``కంపెనీలు డిజైన్ల గురించి నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ప్పుడు సంబంధాల దుర్వినియోగం గురించి కూడా ఆలోచించాలి. మొద‌టి నుంచి వాట్సాప్ త‌మ వినియోగ‌దారుల‌కు ఆన్‌లైన్ స్టేట‌స్ క‌నిపించ‌కుండా చేసుకునే వెసులుబాటు క‌ల్పించాల్సింది. ఇక ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా దీన్ని ఫిక్స్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది`` అంటున్నారు ఈ ఎఫ్ ఎఫ్ సైబ‌ర్ సెక్యూరిటీ డైర‌క్ట‌ర్‌గా ఉన్న ఇవా గ‌ల్పెరిన్‌. దీనిపై వాట్సాప్ ఇంకా స్పందించాల్సి ఉంది!
Published by:Sridhar Reddy
First published:

Tags: CYBER CRIME, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు