విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి శరీరంపై 13 కత్తిగాట్లు

విజయవాడ క్రీస్తురాజుపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి దివ్య తేజస్విని పోస్టుమార్టం పూర్తయింది.

news18-telugu
Updated: October 16, 2020, 8:46 AM IST
విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి శరీరంపై 13 కత్తిగాట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడ క్రీస్తురాజుపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి దివ్య తేజస్విని పోస్టుమార్టం పూర్తయింది. దివ్య తేజస్విని మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు.. ఆమె శరీరంపై 13 కత్తిగాట్లు ఉన్నట్టు గుర్తించారు. గొంతు సమీపంలో లోతైన గాయం కావడంతోనే బాధితురాలి మృతిచెందినట్టు వైద్యులు పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని యువతి ఇంటికి తరలించారు. ఇక, గురువారం ప్రేమోన్మాది చేతిలో దివ్య తేజస్విని హత్యు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజస్విని భీమవరంంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఈయర్ చదువుతోంది. కరోనా నేపథ్యంలో ఇంటివద్దే ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది. ఆమె ఇంటి సమీపంలోనే ఉంటున్న బుడిగ నాగేంద్ర అలియాస్ చిన్నస్వామితో తేజస్వికి కొన్నాళ్లుగా పరిచయం ఉంది. అయితే గురువారం ఉదయం ఇంటి వెనకాల నుంచి దివ్య తేజస్వి ఇంట్లో దూరాడు. లోపల నుంచి తలుపు గడియపెట్టి కత్తితో ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తనను తాను పొడుచుకున్నాడు.

ఆ సమయంలో రేషన్ కార్డు నమోదు కోసం బయటకు వెళ్లిన బాధితురాలి తల్లి కొద్దిసేపయ్యాక ఇంటికి తిరిగివచ్చారు. అయితే లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపు తెరిచారు. తలుపు తెరవగానే తేజస్విని తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కనిపించింది. దీంతో ఆమెను విజయవాడ ఈఎస్‌ఐకి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు తీవ్ర గాయాలతో ఉన్న నాగేంద్రను పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

నాగేంద్ర, తేజస్విని పెళ్లి జరిగిందా?
అయితే నాగేంద్ర, తేజస్బినిలు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. వారిద్దరు పెళ్లిచేసుకున్నట్టుగా కొందరు స్థానికులు పోలీసులకు తెలిపారు. మరోవైపు నాగేంద్ర, తేజస్విని కలిసి ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని తేజస్విని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా వారు ఖండించారు. అవి మార్ఫిగ్ చేసిన ఫొటోలు అయి ఉంటాయని అన్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి నిందితుడు నాగేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
Published by: Sumanth Kanukula
First published: October 16, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading