మత్తు ఇంజెక్షన్ తీసుకొని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య.. ఆస్పత్రి హాస్టల్ గదిలోనే

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలుకొట్టి గదిలో లోపలికి వెళ్లారు. అక్కడ సౌందర్య మృతదేహం పక్కన ఇంజెక్షన్‌లు కనిపించాయి.

news18-telugu
Updated: August 13, 2020, 7:15 AM IST
మత్తు ఇంజెక్షన్ తీసుకొని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య.. ఆస్పత్రి హాస్టల్ గదిలోనే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఓ స్టాఫ్ నర్సు ఆత్మహత్య చేసుకుంది. ఆస్పత్రి హాస్టల్ భవనంలోనే బలవన్మరణానికి పాల్పడింది. సికింద్రాబాద్‌‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కమ్మగడ్డ గ్రామానికి చెందిన 25 ఏళ్ల సౌందర్య సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగేళ్లుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఆస్పత్రిలో హాస్టల్‌లోనే ఆమె నివసిస్తోంది. ఐతే మంగళవారం విధులు ముగించుకొని హాస్టల్‌కు వచ్చిన సౌందర్య గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.

హాస్టల్ గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో తోటి నర్సులు కిటికీ నుంచి చూశారు. రూమ్‌లో విగతజీవిగా పడి ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలుకొట్టి గదిలో లోపలికి వెళ్లారు. అక్కడ సౌందర్య మృతదేహం పక్కన ఇంజెక్షన్‌లు కనిపించాయి. ఈ నేపథ్యంలో మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమింగా భావిస్తున్నారు. ఆ హాస్టల్ గదిలో 10 మంది అమ్మాయిులు నివసిస్తున్నారు. ఐతే సౌందర్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో వారంతా విధుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 13, 2020, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading