టెర్రరిస్టుల గ్రెనేడ్ ఎటాక్.. 11 మందికి గాయాలు

శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు.

news18-telugu
Updated: February 10, 2019, 9:05 PM IST
టెర్రరిస్టుల గ్రెనేడ్ ఎటాక్.. 11 మందికి గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 9:05 PM IST
శ్రీనగర్‌లో ఉగ్రదాడి జరిగింది. లాల్ చౌక్‌లో టెర్రరిస్టులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది గాయపడ్డారు. అందులో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు కాగా, మరో నలుగురు పౌరులు గాయపడ్డారు. సెంట్రల్ శ్రీనగర్‌లోని పల్లాడియం అనే ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు పరుగులు తీశారు. అనంతరం గ్రెనేడ్ దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. టెర్రరిస్టులు ఆ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉండడంతో వెంటనే భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ప్రతి ఇల్లు జల్లెడపడుతున్నాయి.

రిపబ్లిడ్ డే వేళ.. ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం..


సాయంత్రం 6.45 గంటల సమయంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు విధులు నిర్వహిస్తున్న సమయంలో టెర్రరిస్టులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. గాయపడిన 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...