SRIKAKULAM ARMY JAWAN VASUDEVARAO DECEASED IN ASSAM BORDER NGS
Andrha Pradesh: మొన్నటి వరకు గుండెలపై బిడ్డను ఆడించాడు: మళ్లీ వస్తాను అన్నాడు.. కానీ అనంతలోకాలకు వెళ్లిన ఆర్మీ జవాన్
సెలవులకు మళ్లీ వస్తానని చెప్పి అనంత లోకాలకు వెళ్లిన ఆర్మీ జవాన్
మొన్నటి వరకు ఆ తండ్రి బిడ్డలు క్షణం తీరిక లేకుండా ఆడుకున్నారు. ఆ సమయం వేగంగా గడిచిపోవడంతో సెలవులు మగిసిపోయాయి. అయినా బిడ్డను చూసుకోవాలనే తనివి తీరక.. మళ్లీ సెలవులపై తిరిగి వస్తానని చెప్పి దేశ రక్షణకు వెళ్లాడు... కానీ అనంతలోకాలకు వెళ్లాడు. రేపు ఆ బిడ్డకు మాటలు వచ్చి నానా అని పిలిచినా కనరాని లోకాలకు వెళ్లిపోయాడు.
సరిగ్గా నెల రోజుల కిందట తన బిడ్డను గుండెలపై ఎత్తుకొని మురిసిపోయాడు ఓ కన్నతండ్రి.. బిడ్డ కోసం గుర్రంలా మారి.. తన వీపుపైనా, గుండెలపై ఎక్కించుకుని ఎన్నో ఆటలు ఆడాడు. తన చిన్నారితో ఆడుకునేందుకు వచ్చిన సెలవులన్నీ ఎంజాయ్ చేశాడు. చిన్నారితో జీవితాంతం గుర్తుండే ఎన్నో క్షణాలు గడిపాడు. రోజులు నిమిషల్లా గడిచిపోయాయి. కొడుకుతో ఆడుకోవాల్సిన ఆటలు ఇంకా ఉన్నా.. సెలవులు ముగిసాయి. దీంతో బిడ్డను వదలలేక.. తప్పని సరి పరిస్థితిల్లో దేశ రక్షణ కోసం విధుల్లో పాల్గొనడానికి తిరిగి వెళ్లిపోయాడు. అయితే అలా ఆ తండ్రి కొడుకుల మధ్య మొదలైన దూరం ఇప్పుడు శాశ్వతమైపోయింది. రేపు తన బిడ్డుకు మాటలు వచ్చి నాన్నా అని పిలిచినా రాలేని లోకాలకు తండ్రి తరలివెళ్లాడు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని గొల్లపేటకు చెందిన ఆర్మీ జవాన్ 31 ఏళ్ల కొల్లి వాసుదేవరావు అసోంలో శనివారం మృతి చెందారు. అయితే జవాన్ మృతి వార్త కుటుంబ సభ్యులకు చాలా ఆలస్యంగా తెలిసింది. జవాన్ మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు. గొల్లపేటకు చెందిన వాసుదేవరావు 2010లో ఆర్మీలో జవాన్ గా ఉద్యోగం వచ్చింది. అందరితో కలిసి మెలసి ఉండే వాసుదేవరావు గతేడాది వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం రెండు నెలల చిన్నారి ఉన్నాడు. వాసుదేవరావు భార్య వసంత ప్రస్తుతం ఎల్‌ఎన్‌పేట మండలం గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే బాబు పట్టడంతో.. అతడిని చూసుకునేందుకు సెలవులపై వాసుదేవరావు ఇంటికి వచ్చి.. తన వారుసుడి చూసుకుని తెగ మురిసిపోయాడు. ఇటీవల ఎలక్షన్ల సమయంలో కూడా ఇంటి వద్దనే ఉన్నాడు. వచ్చిన సెలవుల్లో కొడుకే జీవితంగా సమయం గడిపాడు. క్షణం కూడా వేరే పని లేకుండా కొడుకుతోనే కాలక్షేపం చేశాడు. ఎన్నో ఆటలు ఆడుకున్నాడు.. తండ్రీ కొడుకులకు మాత్రమే అర్థమయ్యే ఊసులు ఎన్నో చెప్పుకున్నారు. ఇలా ఎంతో ఆనందంగా ఇద్దరు గడిపారు. కొడుకుతో గడిపిన క్షాణాలను ఎప్పటికీ మరిచిపోలేను అంటూ ప్రతిక్షణాన్ని వాసుదేవరావు తన మనసులోనే ముద్రించుకున్నాడు.
రోజులు కొన్ని క్షణాల్లానే గడిచిపోయాయి. దీంతో సెలవులు ముగిసిపోయాయి. దేశ రక్షణ కోసం తిరిగి విధుల్లో నిమగ్నమయ్యారు. అయితే రాత్రి ఈ సమాచారం అందడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. అయితే వాసుదేవరావు మృతికి గల కారణాలను మాత్రం ఆర్మి అధికారులు తమకు వివరించలేదంటున్నారు అతడి కుటుంబ సభ్యులు. విషయం తెలియడంతో జవాన్ తల్లిదండ్రులు అప్పన్న, లక్ష్మీ కన్నీరుమున్నీరవుతుండగా వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆర్మీ జవాన్ పార్థివ దేహం ఇవాళ గ్రామానికి చేరుకోవచ్చునని తెలుస్తోంది. అసోంలో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్న వాసుదేవరావు చనిపోయాడని వార్త తెలియడంతో గొల్లపేటలో పెను విషాదం నెలకొంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.