సీఐ ఇంట్లో భారీ చోరీ... షాకైన పోలీసులు...

Mumbai Crime News : ఎలాంటి దొంగలైనా పోలీసుల ఇళ్లలో చోరీ చెయ్యాలని అస్సలు అనుకోరు. అలాంటి సాహసం చెయ్యరు. మరి ఇదెలా జరిగింది?

news18-telugu
Updated: March 22, 2020, 10:40 AM IST
సీఐ ఇంట్లో భారీ చోరీ... షాకైన పోలీసులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Mumbai Crime News : ముంబైలోని హాదాప్సర్‌లో వారం కిందట జరిగిందీ చోరీ. నిగ్దీ పోలీస్ స్టేషన్‌ పరిధిలో బాధిత సీఐ జవద్వాద్ పనిచేస్తున్నారు. ఆయన తన పోలీస్ స్టేషన్‌కి దగ్గర్లోని ఓ అద్దె ఇంట్లో ఫ్యామిలీతో పాటూ ఉంటున్నారు. మరో సొంత ఇంట్లో (అపార్ట్‌మెంట్) మార్చి 7 నుంచీ 15 మధ్యలో ఈ చోరీ జరిగింది. రూ.4.20లక్షల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి హదప్సర్ పోలీస్ స్టేషన్‌లో కేసు రాశారు. కానీ... చోరీ చేసిందెవరో తెలియట్లేదు. డూప్లికేట్ తాళం చెవులతో దొంగలు... ఆ ఇంటి తలుపులు తెరిచారు. ఈ చోరీ ఎంత ఈజీగా చేశారంటే... ఎక్కడా ఏవీ పగలగొట్టలేదు. ఇంట్లోని బీరువాను... తెరిచేందుకు కూడా నకిలీ కీస్ వాడారు. ఐతే... జవద్వాద్ భార్య... బీరువాలో నగలను దాయలేదు. కప్ బోర్డులో ఉంచింది. దొంగలు అతి తెలివిగా... కప్ బోర్డ్ కూడా వెతికి... నగలను పట్టుకుపోయారు. ఎక్కడా ఏవీ పగలకపోవడంతో చోరీ జరిగినట్లు వెంటనే ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత ఓ రోజున సీఐ ఆ అపార్ట్‌మెంట్‌కి వెళ్లినప్పుడు తలుపు తాళం ఊడిపోయి ఉంది. అలా చోరీ జరిగిన విషయం తెలిసింది.

ఒక సెట్ కీస్ జవద్వాద్ దగ్గర ఉండగా... అపార్ట్‌మెంట్‌లో మొక్కలకు నీరు పోసేందుకు నియమించిన వాచ్‌మేన్ దగ్గర రెండో సెట్ కీస్ ఉన్నాయి. ఐతే... వాచ్ మేన్ చోరీ ఎప్పుడు జరిగిందో తనకూ తెలియదంటున్నాడు. తాను ఎవరికీ కీస్ ఇవ్వలేదని చెబుతున్నాడు. తాను మొక్కలకు నీరు పోసే సమయంలో ఎవరూ అపార్ట్‌మెంట్ దగ్గరకు రాలేదంటున్నాడు. మరైతే చోరీ ఎలా జరిగింది అన్నది చిత్రంగా ఉంది. పోలీసులు వాచ్‌మేన్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు జనతా కర్ఫ్యూ హడావుడిలో ఉన్నారు. ఈ కరోనా టెన్షన్ తీరిన తర్వాత... ఇలాంటి కేసుల సంగతి చూస్తామంటున్నారు.

First published: March 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading