ఆపరేషన్ థియేటర్‌లో రహస్య కెమెరాలు... ప్రసవం చేస్తుండగా వీడియోలు తీసి...

ఆపరేషన్ థియేటర్‌లో అమర్చిన రహస్య కెమెరాల్లో మహిళల జననాంగాలు రికార్డు... మహిళలు దుస్తులు మార్చుకునే గదుల్లోనూ స్పై కెమెరాలు... మెడిసిన్స్ పోతున్నాయనే సీక్రెట్ కెమెరాలు పెట్టామని ఒప్పుకున్న ఆసుపత్రి సిబ్బంది...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 8:07 PM IST
ఆపరేషన్ థియేటర్‌లో రహస్య కెమెరాలు... ప్రసవం చేస్తుండగా వీడియోలు తీసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆపరేషన్ థియేటర్‌లో రహస్య కెమెరాలు అమర్చి, తన అనుమతి లేకుండా ప్రసవాన్ని రికార్డు చేసిన ఆసుపత్రిపై దావా వేసిందో మహిళ. ఆసుపత్రిలో మహిళలకు సంబంధించిన చాలా గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి, వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలోని శాండియాగోలో ఉన్న షార్ప్ హెల్త్‌కేర్ ఆసుపత్రిలో వెలుగుచూసింది. ప్రసవ సమయంలో మహిళలకు సంబంధించిన వీడియోలను రహస్య కెమెరాలతో రికార్డు చేస్తున్నట్టు ఓ మహిళ గుర్తించింది. ప్రసవం ముందు నిర్వహించే వివిధ పరీక్షల సమయంలోనూ రహస్య కెమెరాలు తమ కదలికలన్నీ రికార్డు చేశాయని ఆరోపించింది. 2012 నుంచి ఈ ఆసుపత్రి సేవలు అందిస్తోంది. అప్పటి నుంచే ఈ రకమైన పనులు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు మహిళలు. మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత ఏకంగా 80 మంది మహిళలు ఆసుపత్రిపై దావా వేశారు. అయితే దీనిపై ఆసుపత్రి యాజమాన్యం వేరే విధంగా స్పందించింది.

ఆసుపత్రిలో చాలారోజులుగా మెడిసిన్స్ చోరికి గురవుతున్నాయని, అందుకే మెడిసన్స్ ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకునేందుకే రహస్య కెమెరాలను అమర్చినట్టు తెలిపింది. అయితే ఈ రహస్య కెమెరాలు మహిళలు ఎక్కువగా ఉండే గదుల్లో, ప్రసవాలు జరిగే మెటర్నిటీ వార్డులో ఉండడంతో మహిళల వీడియోలు రికార్డు అయ్యాయని ఒప్పుకుంది. జరిగింది తప్పేనని ఒప్పుకున్న యాజమాన్యం... అందుకు చింతిస్తున్నామని చెప్పింది. గత 11 నెలల్లో దాదాపు 1800 మంది మహిళల వీడియోలు రికార్డు అయ్యినట్టు యాజమాన్యం స్వయంగా ఒప్పుకోవడం విశేషం. దీన్ని బాధిత మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దొంగతనాలు అరికట్టేందుకు ప్రసవాల గదిలో సీక్రెట్ కెమెరాలు ఎందుకు అమర్చారంటూ నిలదీస్తున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో అమర్చిన రహస్య కెమెరాల్లో మహిళల జననాంగాలు కూడా రికార్డు అయ్యాయని, దుస్తులు మార్చుకునే గదుల్లోనూ స్పై కెమెరాలు ఎందుకు పెట్టారని ఆసుపత్రి యాజమాన్యం చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోలన్నీ ఆసుపత్రిలోని ఓ కంప్యూటర్‌లో భద్రపరిచారు సిబ్బంది. సదరు కంప్యూటర్‌కు పాస్‌వర్డ్ కూడా లేకపోవడంతో చాలామంది, చాలాసార్లు మహిళల ప్రైవేట్ వీడియోలను చూసి ఉంటారని, అవి ఎంత మంది మొబైళ్లలోని వెళ్లాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First published: April 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading