విద్యార్థినిపై కన్నేసిన స్పోర్ట్స్ టీచర్. మొబైల్‌లో నగ్న ఫొటోలు చూపిస్తూ...

ప్రతీకాత్మక చిత్రం

ఆ స్కూలులో ఓ స్టోర్ రూమ్ ఉంది. అందులో పాత సామాన్లు ఉన్నాయి. ఆ గదికీ, ఈ క్రైమ్ కథకూ ఉన్న సంబంధమేంటి? ఈ కథలో చివరకు ఏమైంది? ఎలాంటి మలుపులున్నాయి?

 • Share this:
  అది కేరళ... కోజికోడ్‌లోని... కత్తిప్పారా హోలీ ఫ్యామిలీ హైయర్ సెకండరీ స్కూల్. అక్కడ కొందన్ చెర్రీకి చెందిన వీటీ మనీష్... స్పోర్ట్స్ టీచర్‌గా చేస్తున్నాడు. విద్యార్థులకు రోజూ డ్రిల్ చెప్పేవాడు. అలాగే గేమ్స్ ఆడించేవాడు. ఈ క్లాస్ అంటే విద్యార్థులకు చాలా ఇష్టం. బాగా ఆడుకునేవారు. ఇదే అదనుగా తీసుకున్న మనీష్... విద్యార్థినుల్లో వాయనాడ్‌కి చెందిన ఓ బాలిక కాస్త భయంభయంగా, నెమ్మదిగా ఉంటే... ఆ బాలికపై కన్నేశాడు. తన క్లాస్ జరిగినప్పుడల్లా ఆ బాలికను తన దగ్గరకు పిలిపించుకొని... మొబైల్‌లో గేమ్స్, ఇంటర్నెట్ ఇలా ఏవేవో చూపించేవాడు. ఆ బాలిక.... మాస్టర్ చూపించినప్పుడు చూడకపోతే తిడతారని చూసేది. అలా చూపిస్తూ అప్పుడప్పుడూ బూతు ఫొటోలు, బూతు వీడియోలు కూడా చూపించేవాడు. ఆ బాలిక చూడకుండా ఉంటే... గద్దించి చూపించేవాడు.

  ఇలా ఒకట్రెండు సార్లు చేశాక... ఆ బాలిక ఈ విషయం ఎవరితోనైనా చెబుతుందా అని గమనించాడు. ఎవరికీ చెప్పలేదు. పైగా భయపడుతూ ఉండేది. అందువల్ల తాను ఏం చేసినా ఎవరికీ చెప్పదు అని ఫిక్స్ అయ్యాడు. ఇలా కొన్ని రోజులు తన ప్లాన్ అమలు చేసి... తాజాగా ఆ బాలికను స్కూలు పక్కనే వాడకుండా ఉన్న స్టోర్ రూంకి తీసుకెళ్లాడు. అక్కడ పాత ఆట సామాన్లు ఉన్నాయనీ... వాటిని తీసుకొద్దామని అన్నాడు. ఆ బాలిక అయోమయం ఫేస్ పెట్టి వెనకాలే వెళ్లింది. తీరా ఆ గదిలోకి వెళ్లాక... బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో ఆ బాలిక గట్టిగా అరుపులు అరిచింది. స్కూలంతా వినిపించేంత గట్టిగా అరిచింది. దాంతో కొందరు విద్యార్థులు... వేరే టీచర్లకు చెప్పారు. అప్పటికే మనీష్ ఆ గది నుంచి వేరే మార్గంలో బయటకు వచ్చేశాడు.

  బాధిత బాలిక మొదటి నుంచి జరిగింది మొత్తం ఇప్పుడు బయటపెట్టింది. దాంతో... తోటి టీచర్లు అతనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చేలోగా మరో షాకింగ్ విషయం తెలిసింది. ఆ టీచర్... తమను కూడా వేధించాడని చాలాసార్లు తమను పట్టుకున్నాడని, ఎవరికైనా చెబితే... కొడతానని బెదిరించాడని ఇతర విద్యార్థినులు చెప్పారు. థామరస్సెరీ పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

  ఇది కూడా చదవండి: ప్రేమలో పడ్డారు... లేచిపోయారు... సంవత్సరం తర్వాత షాకింగ్ సీన్

  ఇదే స్పోర్ట్స్ టీచర్.. ఇదివరకు ఓ అథ్లెటిక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అది నెల్లిపాయిల్‌లోని సెయింట్ జాన్స్ స్కూలు. అక్కడ కూడా స్పోర్ట్స్ టీచర్‌గా చేశాడు. అప్పట్లో కేసు నమోదైంది. ఏదో ఒక రకంగా జైలు నుంచి బయటికొచ్చాడు. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత తాజా స్కూలులో చేరి... అదే పాడుపనులు ఇక్కడ మొదలుపెట్టాడు.

  ఈ ఘటన తర్వాత ఆన్‌లైన్ క్లాసులే బెటర్ అంటున్నారు విద్యార్థినుల తల్లిదండ్రులు. తమ పిల్లల్ని తామే బాగా జాగ్రత్తగా చూసుకుంటామని చెబుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: