పూజలంటూ నమ్మించి, ఇద్దరు మహిళలపై అత్యాచారం... ఆస్ట్రేలియాలో గురు అరెస్ట్...

పూజలో నగ్నంగా కూర్చోవాలని మహిళలను నమ్మించి, వారిపై అత్యాచారం... ప్రయాగ్‌రాజ్‌లో పరిచయంతో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆధ్యాత్మిక గురు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 8:34 PM IST
పూజలంటూ నమ్మించి, ఇద్దరు మహిళలపై అత్యాచారం... ఆస్ట్రేలియాలో గురు అరెస్ట్...
పూజలంటూ నమ్మించి, ఇద్దరు మహిళలపై అత్యాచారం... ఆస్ట్రేలియాలో దొంగ బాబా అరెస్ట్...
  • Share this:
అతని పేరు గురు ఆనంద్ గిరి. ఇక్కడి వాళ్లకి పెద్దగా తెలీదు కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆధ్యాత్మిక గురుకు మామూలు ఫాలోయింగ్ లేదు. విదేశాల్లో పర్యటిస్తూ శాంతి పూజలు చేస్తూ తెగ హడావుడి చేస్తుంటాడు గురు ఆనంద్ గిరి. అయితే పూజల పేరిట మనోడు చేసే బూతు బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆస్ట్రేలియా దేశ పర్యటనకు వెళ్లిన ఆనంద్ గిరి... సిడ్నీ నగరంలో బస చేశాడు.ఈ సమయంలో ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి పూజలు పేరుతో వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. పూజలో నగ్నంగా కూర్చోవాలని మహిళలను నమ్మించి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సిడ్నీ వెస్ట్ ఏరియాలోని రూటీహిల్స్‌లో ఉంటున్న 29 ఏళ్ల ఓ మహిళ ఇంట్లో శాంతి పూజ చేస్తానని నమ్మించిన ఆనంద్ గిరి... ఆమె పడకగదిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే ఏరియాలో ఉంటున్న మరో 34 ఏళ్ల యువతిపై కూడా ఇదే విధంగా అత్యాచారం చేశాడు. దీంతో సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సిడ్నీలోని ఒక్సలే పార్క్ ఏరియాలో ఓ ఇంట్లో ఉన్న ఆనంద్ గిరిని అరెస్ట్ చేశారు.

ఆనంద్ గిరిని అరెస్ట్ చేసిన పోలీసులు... అతన్ని పరామట్టా కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం గురు ఆనంద్ దరఖాస్తు చేసుకున్నా, అతన్ని బెయిల్ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆస్ట్రేలియాలో అత్యాచారానికి గురైన మహిళలు... కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్‌లో పరిచయమైనట్టు సమాచారం. వారి పిలుపు మేరకు ఆనంద్ గిరి ఆస్ట్రేలియా వెళ్లి, వారి ఇంట్లోనే పూజలు చేశాడు. గురు ఆనంద్ గిరి అరెస్ట్ అయిన విషయాన్ని అఖిల భారత అఖండ్ పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి కూడా ధృవీకరించాడు. యూపీలో ఫేమస్ ఆధ్యాత్మిక గురుగా పేరొందిన ఆనంద్ గిరి.. ఆస్ట్రేలియాలో అరెస్ట్ కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

First published: May 7, 2019, 8:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading