తమిళనాడులో రోడ్డుప్రమాదం...ఏపీలో దొరికిన మృతదేహం

సుధాకర్ ఫొటోను సర్క్యులేట్ చేసి అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఐనా అతడి ఆచూకీ దొరకలేదు. ఈ కేసు మిస్టరీ వీడక పోలీసులు తలలు పట్టుకున్నారు.

news18-telugu
Updated: January 12, 2019, 9:39 PM IST
తమిళనాడులో రోడ్డుప్రమాదం...ఏపీలో దొరికిన మృతదేహం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 12, 2019, 9:39 PM IST
అక్కడెక్కడో చెన్నైలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ ముక్కలు ముక్కలైంది.  ఆ బండి నడిపిన వ్యక్తి కాలు తెగిపడి రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడిఉంది.  ఐతే బైక్ శకలాలు తప్ప... అతడు మాత్రం కనిపించలేదు. బైక్ నడిపిన వ్యక్తి కోసం పోలీసులు రాత్రంతా గాలించగా..ఆ మరుసటి రోజు అతడి డెడ్‌బాడీ దొరికింది. ఎక్కడో తెలుసా? చెన్నైలో యాక్సిడెంట్ జరిగితే..ఘటనాస్థలానికి 400 కి.మీ దూరంలో ఏపీలో మృతదేహం లభ్యమైంది. మరి ఇదెలా సాధ్యం? వివరాల్లోకి వెళ్తే....

బుధవారం రాత్రి చెన్నై శివారులోని పండూర్‌లో యాక్సిడెంట్ జరిగింది. కాకలూరులోని SIPCOTలో పనిచేసే సుధాకర్ అనే వ్యక్తి.. ఆఫీసు విధులు ముగించుకొని..బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి బైక్‌ని బలంగా ఢీకొట్టింది. యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్...భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఐతే అక్కడ ముక్కలు ముక్కలైన బైక్ శకలాలు, రక్తపు మరకలు, కొన్ని మీటర్ల దూరంలో తెగిపడిన మనిషి కాలు తప్ప..ఏమీ కనిపించలేదు. మరి ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి ఏమడయ్యాడని పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. కానీ ఎటువంటి సమాచారం లభించలేదు.

సుధాకర్ ఫొటోను సర్క్యులేట్ చేసి అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఐనా అతడి ఆచూకీ దొరకలేదు. ఈ కేసు మిస్టరీ వీడక పోలీసులు తలలు పట్టుకున్నారు. సుధాకర్ ఆచూకీ కోసం అతని బంధువులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో కూడా చేయడంతో పోలీసులకు ఏ చేయాలో పాలుపోలేదు. సీన్ కట్‌చేస్తే... గురువారం ఉదయం తమిళనాడు పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. చెన్నై నుంచి వచ్చిన కర్నూల్‌కు వచ్చిన ఓ ట్రక్కులో డెడ్‌బాడీ లభించిందని.. మృతుడికి ఒక కాలు లేదని వెల్లడించారు. ఏపీ పోలీసులు పంపిన ఫొటోను పరిశీలించిన తమిళనాడు పోలీసులు..ఆ డెడ్‌బాడీ సుధాకర్‌దేనని నిర్ధారించారు.

సుధాకర్ డెడ్‌బాడీ కర్నూల్‌కు ఎలా వెళ్లింది?


బుధవారం రాత్రి సుధాకర్ ప్రయాణిస్తున్న బైక్‌ను కారు అతివేగంతో ఢీకొట్టింది. బైక్ తునాతునకలువడంతో పాటు..ఆ వేగానికి సుధాకర్ బాడీ అమాంతం గాల్లో ఎగిరి.. అటుగా వెళ్తున్న లారీపై పడింది. అలాగే 400 కి.మీ. ప్రయాణించి కర్నూల్ చేరింది. గోడౌన్ చేరిన తర్వాత లారీ డ్రైవర్ సరుకులు దింపేందుకు వెళ్లగా..ట్రక్ బాడీలో మృతదేహం కనిపించింది. వెంటనే కర్నూల్ పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి..లారీ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెలుసుకున్నారు. లారీ తమిళనాడు నుంచి రావడంతో..అక్కడికి పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పారు. అప్పటికే సుధాకర్ మిస్సింగ్ కేసును విచారిస్తున్న చెన్నై పోలీసులు..ఫొటో ఆధారాలతో మృతదేహాన్ని గుర్తించారు. అది సుధాకర్‌దే అని నిర్ధారించుకున్న తర్వాత..ఓ బృందాన్ని అక్కడికి పంపి మృతదేహాన్ని చెన్నైకి తీసుకెళ్లారు.
First published: January 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...