హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hyderabad : హుస్సేన్‌సాగర్‌లోకి ఎగిరిపడ్డ కారు.. కొత్త కారులో టిఫిన్ చేయడానికి వెళుతూ..

Hyderabad : హుస్సేన్‌సాగర్‌లోకి ఎగిరిపడ్డ కారు.. కొత్త కారులో టిఫిన్ చేయడానికి వెళుతూ..

హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

కొత్త కారు కొన్న ఉత్సాహంలో యువకులు ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి.. ట్యాంక్ బండ్ ఫుట్ పాత్ ను ఢీకొట్టి అమాంతం హుస్సేన్ సాగర్ లోకి పడిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

ఇంకా చదవండి ...

హైదరాబాద్ (Hyderabad)  నగరంలో నిత్యం జనసంచారం ఉండే ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న రోడ్డుపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ట్యాంక్ బండ్ ఫుడ్ పాత్ ను ఢీకొట్టి అమాంతం హుస్సేన్ సాగర్ లోకి ఎగిరిపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురు యువకులు గాయపడ్డారు. ట్యాంక్ బండ్ పై మార్నింగ్ వాక్ చేస్తున్న వారు ఆ దృశ్యాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగి యువకుల్ని కాపాడి, కారును బయటికి తీసే ప్రయత్నం చేశారు. వివరాలివి..

హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ అదులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు గాయాలతో బయటపడగా, వారిని పోలీసులు యశోద ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా నడిపిన యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్‌, స్పత్రిక్‌, కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

cm kcr : మోదీ సర్కారును అక్కడ ఇరుకున పెట్టేలా.. సీఎం కేసీఆర్ కీలక దిశానిర్దేశం!కొత్త కారు కొన్న ఉత్సాహంలో యువకులు ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే,

హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు

Godavarikhani : ముక్కలుగా నరికి.. వీధికొకటి విసిరేసి.. మీసేవ ఆపరేటర్ దారుణహత్య.. భార్య పనేనా?ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. జిల్లాలోని తల్లాడ మండలంలోని అంబేద్కర్‌ నగర్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Published by:Madhu Kota
First published:

Tags: Car accident, Hussain sagar, Hyderabad, Road accident, Tank Bund

ఉత్తమ కథలు