హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: ఏపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్... పరుగులు పెట్టిన అక్రమార్కులు

Andhra Pradesh: ఏపీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్... పరుగులు పెట్టిన అక్రమార్కులు

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

నాటుసారా తయారీదారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of andhra pradesh ఉక్కుపాదం మోపుతోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై ఇరు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

నాటుసారా తయారీదారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై ఇరు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల సరిహద్దు గ్రామాల్లో నాటుసారా అమ్మకాలు ఎక్కువవడంతో అక్రమ వ్యాపారంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోని సరిహద్దు గ్రామాలైన గొంగపూర్, రామచంద్రపూర్, కొండ బిజాపూర్ ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాల్లో దాడులు నిర్వహించారు. కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటుసారా స్థావరాలను ధ్వంసం చేసారు. మొత్తం 85 మంది పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ లో పాల్గొని ఏకంగా 38,400 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. దాడుల్లో భాగంగా నాటుసారా తయారు చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. కొందరు తప్పించుకోని పారిపోగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇటీవల ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలకు నాటుసారా అక్రమ రవాణా ఎక్కువైంది. సరిహద్దు చెక్ పోస్టుల నుంచి తప్పించుకుంటున్న అక్రమార్కులు.. గ్రామాల్లోని రోడ్ల ద్వారా సారాను రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీనిపై నిఘా ఉంచుతున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, సిరమామిడి గ్రామంలో నాటుసారా తాగి 25 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సారాతాగిన వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లడమే కాకుండా రక్తపు వాంతులు చేసుకున్నారు. దీంతో మరోసారి సరిహద్దుల్లో సారా అక్రమ రవాణా అంశం తెరమీదకు వచ్చింది. సరిహద్దుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ నాటుసారా ఏరులై పారుతున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో పోలీస్ నిఘా సరిగా లేకపోవడంతో వేలాది లీటర్ల సారా రాష్ట్రంలోకి రవాణా అవుతోంది. ఆంధ్రాలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడులు పెరిగిపోవడంతో నాటుసారా వ్యాపారులు ఒడిశాలోని సరిహద్దు గ్రామాల్లో రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు.

నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి అమాయకులు బలికావొద్దని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, నాటుసారా, అక్రమ ఇసుక రవాణాలపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆపరేషన్ నిఘా పేరుతో దాడులు నిర్వహిస్తోంది. ఈ విధంగా నెల రోజుల్లోనే దాదాపు వేలాది కేసులు నమోదు చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Liquor, Liquor ban, Odisha

ఉత్తమ కథలు