ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌ నమ్మి ఇండియాకు వచ్చిన విదేశీ వనితకు మత్తుమందు ఇచ్చి...?

గురుగ్రామ్ లో ఓ హోటల్ లో బస చేసింది. ఈ క్రమంలో నిందితుడు బాధిత మహిళను డీఎల్ఎఫ్ ఫేజ్ వన్ అపార్ట్ మెంట్ కు రమ్మని అడ్రస్ తెలిపాడు. అనంతరం మహిళ ఆ అడ్రస్ కు చేరుకోగా అక్కడే కాపు కాచుకొని కూర్చున్న నిందితుడు, అతని ముగ్గురు స్నేహితులు...

news18-telugu
Updated: June 17, 2019, 9:46 PM IST
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌ నమ్మి ఇండియాకు వచ్చిన విదేశీ వనితకు మత్తుమందు ఇచ్చి...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 17, 2019, 9:46 PM IST
స్పానిష్ యువతిపై లైంగికదాడి జరిగిన ఘటన గురుగ్రాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని స్పానిష్ యువతిని నిందితుడు ఇండియాకు రమ్మని ఆహ్వానించాడు. తమ ఇంట్లో పార్టీ ఉందని, ఆ వేడుకలో పాలుపంచుకోవాలని తెలిపాడు. ఈ విషయాన్ని నమ్మిన మహిళ వెంటనే ఇండియాకు తరలివచ్చింది. అనంతరం గురుగ్రామ్ లో ఓ హోటల్ లో బస చేసింది. తమ ఇంట్లో ఈ వేడుక చాలా స్పెషల్ అని చెప్పి ఆ మహిళను ఊరించాడు. అంతే కాదు ఈ క్రమంలో నిందితుడు బాధిత మహిళను డీఎల్ఎఫ్ ఫేజ్ వన్ అపార్ట్ మెంట్ కు రమ్మని ఒక అడ్రస్ పంపాడు. అనంతరం మహిళ ఆ అడ్రస్ కు చేరుకుంది. తీరా అక్కడి పరిస్థితి చూస్తే అక్కడ ఎలాంటి వేడుకలకు సంబంధించిన పరిస్థితి లేదు. అంతే కాదు నిందితుడు పాటు  అక్కడే కాపు కాచుకొని కూర్చున్న అతని ముగ్గురు స్నేహితులు ఉన్నారు. పార్టీ ఎక్కడ అని స్పానిష్ యువతి అమాయకంగా అడగ్గా...పార్టీ ఇంకా మొదలు కాలేదని, కాసేపు అయ్యాక బంధువులు, స్నేహితులు వచ్చి జాయిన్ అవుతారని నిందితుడు నమ్మబలికాడు. అప్పటి వరకూ వెల్ కమ్ డ్రింక్ రుచి చూడాలని పట్టు పట్టాడు. దీంతో ఆ యువతి అమాయకంగా జ్యూస్ తాగేసింది. ఆమె నెమ్మదిగా మత్తులోకి జారుకుంది.

అంతే ఇదే అదనుగా భావించిన నిందితులు  స్పానిష్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె మత్తు నుంచి బయటపడ్డాక అసలు విషయం చెప్పి, ఆమెను శారీరకంగా హింసిస్తూ. లైంగిక దాడి అనంతరం నోరు మూసుకొని స్పెయిన్ కు వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన బాధిత మహిళ ఎట్టకేలకు ఫోన్ ద్వారా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుల గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను నలుగురిలో ఒకరు పరారీలో ఉండగా, మరో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ కొనసాగుతోంది.

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...