హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana:సూర్యాపేట జిల్లాలో తండ్రిని నరికి చంపిన ఇద్దరు కొడుకులు..ఎందుకో తెలుసా

Telangana:సూర్యాపేట జిల్లాలో తండ్రిని నరికి చంపిన ఇద్దరు కొడుకులు..ఎందుకో తెలుసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Suryapeta:కన్నతండ్రిని కిరాతకంగా హతమార్చారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కత్తి, గొడ్డలితో తండ్రిని నరికి చంపిన ఘటన అందర్ని షాక్‌కి గురి చేసింది. తండ్రి పేరుతో ఉన్న భూమిని ఇద్దరికి పంచి ఇవ్వడం లేదన్న కోపంతో ఈఘాతునికి పాల్పడ్డారు.

ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకోవడం, భూమి పంచాయితీలో అన్నదమ్ముల మధ్య తేడా వస్తే దాడులు చేసుకోవడం చూశాం. కాని సూర్యాపేట జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆస్తి పంచని కారణంగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కన్నతండ్రి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సూర్యాపేట(Suryapeta)జిల్లా ఆత్మకూరు(ఎస్‌)(Atmakuru)మండలం తుమ్మలపెన్‌పహాడ్(Tummalapenpahad)గ్రామానికి చెందిన 50సంవత్సరాల ఎరగాని శ్రీనివాస్‌గౌడ్‌ (Eragani Srinivas Gouda)హత్యకు గురయ్యాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. శ్రీనివాస్‌గౌడ్‌కి గ్రామంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి పంపకాల విషయంలోనే ఈదారుణం జరిగింది. శ్రీనివాస్‌గౌడ్‌కి సంతు(Santhu),రాజశేఖర్‌(Rajasekhar)అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఇద్దరు కొడుకులు తండ్రి శ్రీనివాస్‌గౌడ్ పేరుతో ఉన్న భూమిని పంచమని (Land distribution)ఒత్తిడి చేస్తూ వచ్చారు. పలుమార్లు ఇదే విషయంలో తండ్రితో గొడవ కూడా పడ్డారు. అతను భూమిని పంచి ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో గురువారం(Thursday)ఉదయం ఇద్దరు కొడుకు సంతు, రాజశేఖర్‌ కత్తి, గొడ్డలి పట్టుకొచ్చి తండ్రిని అత్యంత దారుణంగా నరికి చంపారు.

ఆస్తి కోసం అఘాయిత్యం..

కేవలం భూమిని పంచివ్వలేదన్న కోపంతో తండ్రి పట్ల ఇద్దరు కొడుకులు కర్కశంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస్‌గౌడ్‌ని కొడుకులే హతమార్చడంతో భార్య, కుమార్తె బోరున విలపిస్తున్నారు.కొడుకులు తండ్రిని హతమార్చిన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని,సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు కొడుకులపై కేసు నమోదు చేశారు. మృతుడు శ్రీనివాస్‌గౌడ్  కుటుంబ సభ్యులను విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కన్నతండ్రి అనే కనికరం కూడా చూపకుండా కొడుకులే  చంపడంపై స్థానికులు మండిపడుతున్నారు.

కొడుకులు కాదు కిరాతకులు..

నల్లగొండ జిల్లాలో సైతం ఇంచుమించు ఇదే తరహా ఘటన మరొకటి జరిగింది. గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందిన హరినారాయణ అనే వ్యక్తి కూడా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నాడు. అతని ఆరోగ్యం కుదట పడదని..ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించడంతో ఆయన కుమారులు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొచ్చి ఆస్తి పంపకాలు చేపట్టాలని పట్టుబట్టారు. హరినారాయణ సోదరుడు కుదరదని చెప్పడంతో..తమ తండ్రి చనిపోతే ఇంట్లోనే ఖననం చేస్తామని బెదిరించారు. విషయం పోలీసులకు తెలియడంతో స్పాట్‌కి చేరుకొని హరినారాయణ కొడుకులకు సర్ధి చెప్పారు. ఇంటిలో భాగం విషయం కోర్టులో తేల్చుకోవాలని సూచించడంతో కొడుకులు అంబులెన్స్‌లోనే ఇంటికి తీసుకెళ్లారు.

First published:

Tags: Murder, Suryapeta

ఉత్తమ కథలు