• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SONS LEFT THEIR FATHER IN FOREST SHOWING HELL WHILE ALIVE VB

Telangana: కన్న తండ్రిని అనంతగిరి అరణ్యంలో వదిలేసిన కుమారులు.. బతికుండగానే నరకం చూపించి...

Telangana: కన్న తండ్రిని అనంతగిరి అరణ్యంలో వదిలేసిన కుమారులు.. బతికుండగానే నరకం చూపించి...

ప్రతీకాత్మక చిత్రం

Vikarabad: కన్న కొడుకులే తండ్రి పాలిట శాపంగా మారారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తన తండ్రిని కుమారులు అరణ్యంలో వదిలేశారు. పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులు కన్న తండ్రికి నరకం చూపించారు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు.

  • Share this:
    మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన ఇది. వృద్ధాప్య నరకం నుంచి కాపాడాల్సిన కొడుకులు బతికుండగానే తండ్రిని అడవికి పంపారు. ఇద్దరు కొడుకులు కలిగిన తనను బాగానే చూసుకుంటారని సంబురపడ్డాడు. తనకు ఉన్న ఆస్తిని చెరి సగం పంచేశాడు. చివరి రోజులు తన పిల్లల్ని చూస్తు గడిపేద్దామనుకున్నాడు. కానీ కొడుకులు మాత్రం అందుకు బిన్నంగా ప్రవర్తించారు. పున్నామ నరకం నుంచి కొడుకు కాపాడుతాడనే నమ్మకం అందరికీ ఉంటుంది. కానీ కాపాడటం అలా ఉంచితే బతికుండగానే నరకం చూపేందుకు సిద్ధమయ్యారు. పకబ్బందీగా మరీ ఆయన్ను ఏకంగా అడవుల్లో వదిలేసి వచ్చారు. ఈ హృదయ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ టూ టౌన్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ మండలం పుల్లూరుకు చెందిన స్వామి(62)కి ఇద్దరు కుమారులు. పుల్లూరులో తనకు ఉన్న ఎకరం పొలం అమ్మిన స్వామి ఆ సొమ్ముతో హైదరాబాద్ నార్సింగ్ లో ఇల్లు కట్టుకుని కుమారులతోపాటు ఉంటున్నాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. వారిద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాలు చేస్తుండగా, కోడళ్లు ఉపాధ్యాయినీలుగా విధులు నిర్వహిస్తున్నారు.

    కోడళ్లపై విసురుకుంటున్నాడన్న నెపంతో..

    చీటికి మాటికి కోడళ్లపై విసురుకుంటున్నాడనే నెపంతో కన్నతండ్రి పై కోపం పెంచుకున్నారు కుమారులు. ఇద్దరూ పకబ్బందీగా ఆలోచించి మళ్లీ ఇంటికి రాలేనంత దూరంలో ఆయన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నాలుగు రోజుల కిందట అనంతగిరి అడవిలో వదిలేసి వచ్చారు. చేసేదిలేక ఎలాగో అక్కడ నుంచి నడచుకుంటూ అనంతగిరి నుంచి వికారాబాద్ వైపు వచ్చాడు. అక్కడ కోర్టు సమీపంలో ఉన్న టల్ ఒక హోటల్ యజమాని మహ్మద్ గౌస్ దగ్గరికి వెళ్లి తాగడానికి నీళ్లు అడిగాడు. ఒంటి పై సరైన దుస్తులు లేకుండా, నిస్సత్తువగా ఉన్న ఆయనపై జాలిపడిన గౌస్ నీళ్లతోపాటు భోజనమూ పెట్టాడు. తర్వాత వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

    ఆశ్రయమిచ్చిన యజమాని..

    అతడిపై జాలితో మూడు రోజులుగా తన హోటల్ లోనే ఆశ్రయమిచ్చాడు. సోమవారం హోటల్ కు వచ్చిన వినియోగదారుడు ఇచ్చిన సమాచారం మేరకు వికారాబాద్ టూ టౌన్ ఎస్సై కోటేశ్వరరావు వృద్ధుడిని విచారించారు. వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం వికారాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 'మహిత మినిస్ట్రీస్' అనాధ ఆశ్రమంలో చేర్పించారు. స్వామి తెలిపిన వివరాల ఆధారంగా కుమారులను విచారించి, అనంతరం వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వివరించారు.
    Published by:Veera Babu
    First published: