కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia gandhi) వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌పై అత్యాచార కేసు నమోదైంది. తనను ఉద్యోగం ఇప్పిస్తానిన , పెళ్లి చేసుకుంటానని చెప్పి పీపీ మాధవన్ పలు మార్లు అత్యాచారం చేశాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసుపై సోనియా గాంధీ పీఏ మాధవన్ స్పందించాడు. కావాలని తమపై , కుట్రలు చేస్తున్నారని కొట్టిపారేశారు.
కొన్ని మీడియాలలో పీపీ మాధవన్ (PP madhavan) బాగోతంపై కథనాలు ప్రచురితమయ్యాయి. ఉద్యోగం, ఇంటర్వ్యూ అని, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ కథనాలు వెలువడ్డాయి. సదరు దళిత మహళ భర్త గతంలోనే మరణించాడు. 2020లో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లలో లేబర్‌గా పని చేసేవాడని తెలిసింది. ప్రస్తుతం ఈ సంఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్రదుమారంగా మారింది.
ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక బ్యాంకు మేనెజర్ యువతి హనీ ట్రాప్ వలలో పడ్డాడు.
ఇండియన్ బ్యాంక్ లో ఆడిట్ కు వచ్చిన అధికారులు డబ్బులు నిల్వలు తక్కువగా ఉండటంతో ఆరా తీయగా ఘటన వెలుగులోనికి వచ్చింది. బెంగళూరులోని హనుమంతనగర్లో ఉన్న ఇండియన్ బ్యాంక్ మేనెజర్ హరిశంకర్, డేటింగ్ యాప్ లో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కాల్స్.. వరకు వెళ్లింది. హరిశంకర్ ఆమె బుట్టలో పడిపోయాడు. ఈ క్రమంలో.. తన ప్రియురాలి కోసం కస్టమర్ లు బ్యాంక్ లో పెట్టిన సోమ్మును ఆమె చెప్పిన అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్ చేశాడు.
అతగాడు.. ఏకంగా .5.7 కోట్లను యువతి చెప్పిన అకౌంట్ లకు మళ్లించాడు. కాగా, మే 13 నుంచి 19 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ లో 28 ఖాతాలకు, కర్ణాటకలోని 2 ఖాతాలకు.. మొత్తం 136 లావాదేవీల్లో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతని పర్సనల్ డబ్బులు.. 12.5 లక్షలను కూడా ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరిశంకర్ ను అరెస్టు చేశారు. అనేక కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Delhi, Rape case, Sonia Gandhi