Home /News /crime /

SON UPSET ABOUT MOTHER EXTRA MARITAL AFFAIR THEN KILLED HIS MOTHER AND HER LOVER SSR

Shocking Incident: బయట తిరిగి రాత్రి ఇంటికెళ్లిన కొడుకు.. ఏ కొడుకూ చూడకూడని స్థితిలో కనిపించిన తల్లి.. చివరికి..

సుమన్, మతాదిన్ సింగ్

సుమన్, మతాదిన్ సింగ్

సమాజంలో కొందరు క్షణిక సుఖాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఓ తల్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఫలితంగా.. కన్న కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జైపూర్ రూరల్ జిల్లాలోని కోట్పుట్లీ మున్సిపాలిటీలో వెలుగుచూసింది.

ఇంకా చదవండి ...
  జైపూర్: సమాజంలో కొందరు క్షణిక సుఖాల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఓ తల్లి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఫలితంగా.. కన్న కొడుకు చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన జైపూర్ రూరల్ జిల్లాలోని కోట్పుట్లీ మున్సిపాలిటీలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పుట్లీలోని ఖతానా మార్కెట్‌కు ఎదురుగా ఉండే శివ్ కాలనీకి చెందిన సుమన్ అనే మహిళ కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి ఉంటోంది. కొడుకు యోగక్షేమాలు చూసుకుంటూ ఉన్న సుమన్‌కు మతాదిన్ సింగ్ షెకావత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత రెండేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి వయసుకొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా నేరుగా ఇంట్లోనే ప్రియుడితో సుమన్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. తల్లి ప్రవర్తన కొడుకుకు ఏమాత్రం నచ్చలేదు.

  కన్నతల్లికి ఆ విషయం గురించి చెప్పడానికి ఆమె కొడుకు పంకజ్ చాలా ఇబ్బందిపడ్డాడు. ధైర్యం చేసి తల్లికి ప్రవర్తన మార్చుకోవాలని.. ఆయనను మళ్లీ ఇంటికి రానివ్వొద్దని చెప్పాడు. అయినప్పటికీ సుమన్ కొడుకు మాటను పట్టించుకోలేదు. దీంతో.. పంకజ్ తల్లిపై పగ పెంచుకున్నాడు. ఇంటికొస్తున్న అతనిని చూసి కోపంతో రగిలిపోయాడు. పట్టరాని కోపంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల రాత్రి సమయంలో బయటకు వెళ్లి ఇంటికొచ్చేసరికి పంకజ్‌కు ఏ కన్నతల్లీ కొడుకుకు కనిపించకూడని స్థితిలో సుమన్, ఆమె ప్రియుడు కనిపించారు. ఆ పరిణామంతో తీవ్రంగా ఆవేశానికి లోనైన పంకజ్ పిస్టల్‌తో కన్నతల్లి సుమన్‌ను, ఆమె ప్రియుడు.. ఆయుర్వేద డాక్టర్ అయిన మతాదిన్ సింగ్‌ను కాల్చి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిని చంపిన విషయాన్ని తన పిన్నికి, పిన్ని కూతురు కుష్బూకు వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు.

  ఇది కూడా చదవండి: Brutal Crime: ఇంత దగ్గరయిన వీళ్లను చూస్తుంటే ముచ్చటేస్తోందా.. ఏం జరిగిందో తెలిస్తే పాపం అనిపిస్తుంది..!

  ఉదయం 9 గంటల సమయంలో ఆ మెసేజ్ చూసిన పంకజ్ పిన్ని.. ఇంటికెళ్లి చూసేసరికి సుమన్, ఆమె ప్రియుడు నగ్నంగా.. విగత జీవులుగా పడి ఉన్నారు. పంకజ్ పిన్ని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పంకజ్ గురించి విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతనికి నేర చరిత ఉందని పోలీసులు గుర్తించారు. ఎప్పుడూ పిస్టల్‌ను వెంట ఉంచుకునేవాడని, ఈ జంట హత్యల తర్వాత కూడా ఇంట్లోనే గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఓ క్రిమినల్ గ్యాంగ్‌లో పంకజ్ కీలకంగా వ్యవహరించేవాడని.. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయని విచారణలో తేలింది. పంకజ్ ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదని.. ఎక్కువగా హర్యానాలోని భీవాని వెళ్లి అక్కడే తన స్నేహితులతో ఉండేవాడని తెలిసింది. ఐదు నెలల క్రితమే ఇంటికి వచ్చాడని.. తల్లి ప్రవర్తన నచ్చక హత్య చేసి తప్పించుకు పారిపోయినట్లు తేలింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Mother, Son kills his mother

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు