ఓ వ్యక్తి బ్రోతల్ హౌస్‌లో చిక్కుపోయిన తల్లిని విడిపించడానికి నెలల తరబడి పోరాటం చేశాడు. ఎట్టకేలకు తన తల్లిని బ్రోతల్ హౌస్ నుంచి విడిపించి.. న్యాయ పరమైన ప్రక్రియ పూర్తిచేసి ఆమెతో కలిసి ఊరికి బయలుదేరాడు. ఇది శనివారం పుణె రైల్వే స్టేషన్ నుంచి కోల్‌కతా బయలుదేని గౌరవ్(పేరు మార్చడం జరిగింది), అతని తల్లి కథ. గౌరవ్ తండ్రి చనిపోవడంతో.. ఆమె తల్లి కోల్‌కతాలో పలు ఇళ్లలో పనిచేసి కుటుంబాన్ని పోషించేది. గౌరవ్ కూడా తనకు తోచిన పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించేవాడు. అయితే ఓ వ్యక్తి మాయ మాటలు నమ్మి గౌరవ్ తల్లి.. పుణెలోని ఓ వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడింది. అయితే ఓ విటుడు ఆమెకు సహకరించి.. గౌరవ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమె అక్కడి నుంచి బయటపడటానికి మార్గం ఏర్పడింది.
ఇందుకు సంబంధించి గౌరవ్ The Indian Expressతో మాట్లాడుతూ.."నా తల్లి కోల్‌కతాలో పనిమనిషిగా పనిచేసేది. 2019లో ఓ వ్యక్తి నా తల్లి మంచి ఉపాధి చూపెడతానని చెప్పి పుణెకు తీసుకెళ్లాడు. అయితే పుణెకు వచ్చిన తర్వాత అతడు నా తల్లిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టివేశాడు. బుధ్వార్ పేట్‌లోని రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచార కూపంలో చిక్కుకుపోయింది. అయితే కొన్ని నెలల తర్వాత ఆ వ్యభిచార కూపానికి వచ్చిన వ్యక్తి నా తల్లి అభ్యర్థన మేరకు మాకు ఫోన్ చేశాడు. ఆమె ఉన్న అడ్రస్‌ను మాకు చెప్పాడు. దీంతో నేను పశ్చిమ బెంగాల్, పుణెలకు చెందిన సామాజిక కార్యకర్తల సాయంతో పుణె పోలీసులను ఆశ్రయించాను"అని తెలిపాడు.
దీంతో పుణె సిటీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ బుద్వార్ పేటలోని బ్రోతల్ హౌస్‌పై గతేడాది సెప్టెంబర్ 18న దాడి చేశారు. అందులో నుంచి ఇద్దరు మహిళలను రక్షించగా అందులో ఒకరు గౌరవ్ తల్లి కూడా ఉన్నారు. బ్రోతల్ హౌస్‌ను రన్ చేస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అందులో గౌరవ్ తల్లిని బ్రోతల్ హైస్‌కు అమ్మేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు గౌరవ్ తల్లిని పుణెలోని government observationలో ఉంచారు.
ఇక, గతేడాది నవంబర్‌లో గౌరవ్ తన తల్లిని తీసుకెళ్లేందుకు పుణెకు వచ్చాడు. అయితే న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసేందుకు పలువురు సామాజిక కార్యకర్తల సాయం తీసుకన్నాడు. ఇది పూర్తి కావడానికి మూడు నెలల సమయం పట్టింది. చివరకు మార్చి 2వ తేదీన బాధితురాలిని తన కొడుకుకు అప్పగించాల్సిందిగా ఫస్ట్ జూడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. దీంతో పోలీసులు, అధికారులు బాధిత మహిళ నుంచి, ఆమె కొడుకు నుంచి.. ఈ కేసు విచారణ సమయంలో హాజరవుతామని అండర్ టేకింగ్ ఫామ్స్ తీసుకున్నారు. ఇక, చివరకు తన తల్లితో కలిసి కోల్‌కతా వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని గౌరవ్ చెప్పారు. ఇది తన జీవితంలో తీరని విషాదమని.. కోర్టు దోషులను శిక్షిస్తుందని నమ్ముతున్నట్టు గౌరవ్ తల్లి చెప్పారు.