షాకింగ్.. ఫోన్‌లో గేమ్ ఆడిన కొడుకు.. తల్లి అకౌంట్‌లో రూ. 5.6 లక్షలు మాయం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల తన అకౌంట్‌లో నుంచి డబ్బులు డ్రా చేద్దామని భావించిన కుర్రాడి తల్లి... అందులో డబ్బులు లేకపోవడంతో షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Share this:
    ఆన్‌లైన్ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయనే అంశం మరోసారి రుజువైంది. కుమారుడి ఆన్‌లైన్ చదువు కోసం ఫోన్ ఇచ్చి ఊరుకున్న ఓ మహిళ... ఏకంగా ఐదున్నర లక్షల రూపాయలు నష్టపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అమలాపురం నగరానికి చెందిన సుల్తానా అనే మహిళ... తన కుమారుడు ఆన్ లైన్‌లో చదువుకోవడం కోసం తన ఫోన్ ఇస్తూ వచ్చింది. అయితే ఆన్‌లైన్ క్లాస్ ముగిసిన తరువాత ఆమె అబ్బాయి ఫోన్ ద్వారా ఓ వీడియో గేమ్ డౌన్‌లోడ్ చేశాడు. జూన్ 20 నుంచి ఆ గేమ్ ఆడుతూ వచ్చాడు. గేమ్‌లో చూపించిన విధంగా డబ్బు పెట్టి అందులో ఆయుధాలు కొనడం మొదలుపెట్టాడు. ఇదంతా తనకు తెలియకుండానే చేస్తూ పోయాడు.

    ఇలా ఒక్కోసారి రోజుకు రూ. 30 వేల వరకు ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఖర్చుచేశాడు ఆ కుర్రాడు. ఇటీవల తన అకౌంట్‌లో నుంచి డబ్బులు డ్రా చేద్దామని భావించిన కుర్రాడి తల్లి... అందులో డబ్బులు లేకపోవడంతో షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఆ డబ్బులు ఏమయ్యాయని విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఇక్కడే ఏదో ఒక వ్యాపారం చేద్దామని ఆ డబ్బు పంపించాడని... ఇప్పుడు ఆ డబ్బంతా పోవడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదని సదరు మహిళ వాపోయింది.
    Published by:Kishore Akkaladevi
    First published: