‘మొబైల్ మత్తు’లో కన్నతల్లిని కడతేర్చిన రాక్షసుడు

మొబైల్ మత్తు ఎంత ప్రమాదకరమైనదో తెలిపే సంఘటన ఇది. మొబైల్ ఫోన్‌కు బానిసైన ఓ యువకుడు కన్నతల్లిని కత్తితో పొడిచి హంతకుడయ్యాడు. జైలుకు వెళ్లకుండా అతణ్ని కాపాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

news18-telugu
Updated: August 2, 2020, 10:06 AM IST
‘మొబైల్ మత్తు’లో కన్నతల్లిని కడతేర్చిన రాక్షసుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడి మొబైల్ మత్తు కన్న తల్లి ప్రాణాలను బలితీసుకుంది. ఆ యువకుడిని హంతకుడిగా మార్చింది. గంటల తరబడి మొబైల్ ఫోన్‌ వాడుతున్న తన తనయుడిని తల్లి శ్రీలక్ష్మి(45) మందలించింది. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంటి నుంచి బయటకెళ్లి చెడు అలవాట్లున్న స్నేహితులతో కలిసి తిరగొద్దని హెచ్చరించింది.   దీంతో రాక్షసుడిగా మారిన ఆ తనయుడు...బేగుబందాన్ని మరిచి కన్నతల్లిని కత్తితో పొడిచి హతమార్చాడు. కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకున్న ఈ సంఘటన యువకుల్లో మొబైల్ ఫోన్ వ్యసనం ఎంత నష్టాన్ని కలిగిస్తుందో తేటతెల్లం చేస్తోంది.

గురువారంనాడు మాండ్యాలోని విద్యా నగర్‌లోని ఇంట్లో ఓ మహిళ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. రెండు రోజుల దర్యాప్తు అనంతరం...బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె తనయుడు మను శర్మ(21) హంతకుడని పోలీసులు తేల్చారు. ఒంటరిగా ఉన్న తల్లిని చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్లిపోయిన మనుశర్మ...స్థానిక పోలీసులు హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో అక్కడకు చేరుకుని అమాయకుడిలా నటించాడు. పలు కోణాల్లో కేసు దర్యాప్తు జరుపుతున్న పోలీసులు...హంతకుడు కొడుకేనని తేలడంతో నిశ్చేష్టులయ్యారు. తానే తల్లిని హత్యచేసినట్లు పోలీసుల విచారణలో మనుశర్మ అంగీకరించాడు.

మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఆదర్శ, మనుశర్మ. చదువులో వెనుకబడి...నిత్యం మొబైల్ ఫోన్‌లో లీనమైన పెద్ద కుమారుడు మను శర్మను అతని తల్లి మందలించింది. గురువారం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరింది. మనుశర్మను అతని తల్లి బలంగా తలపై కొట్టింది. దీంతో విచక్షణ కోల్పోయిన మనుశర్మ...కిచెన్‌లోని చాకును తీసుకుని ఆమెను విచక్షణారహితంగా పొడిచి...ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఇంట్లో కుప్పకూలిపోయిన శ్రీలక్ష్మి...రక్తపు మడుగులో పడి మృతి చెందింది. తమ దర్యాప్తులో మనుశర్మ హంతకుడని తేలడంతో...పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

మనుశర్మే ఆమెను హతమార్చినట్లు ముందే నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు..అతన్ని కాపాడేందుకు శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించడం కొసమెరుపు. అయితే పొరుగింటి వాళ్లు మనుశర్మ గురించి ఇచ్చిన క్లూస్ పోలీసుల దర్యాప్తునకు ఎంతో ఉపయోగపడ్డాయి. తమదైన శైలిలో మనుశర్మను ప్రశ్నించడంతో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు.
Published by: Janardhan V
First published: August 2, 2020, 9:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading