తల్లి శవాన్ని ఇంట్లోకి రానివ్వని కొడుకు.. మంగళగిరిలో అమానవీయ ఘటన..

ప్రతీకాత్మక చిత్రం

నవమాసాలు మోసి, కనిపెంచిన అమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ ఆకస్మికంగా చనిపోతే కనీసం ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి రానీయకుండా అడ్డుకున్నాడో కర్కశ కొడుకు. ఈ అమానవీయ ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది.

  • Share this:
    నవమాసాలు మోసి, కనిపెంచిన అమ్మ వృద్ధాప్యంతో బాధపడుతూ ఆకస్మికంగా చనిపోతే కనీసం ఆమె భౌతిక కాయాన్ని ఇంటికి రానీయకుండా అడ్డుకున్నాడో కర్కశ కొడుకు. ఈ అమానవీయ ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన యుద్ధం సత్యనారాయణ, ధనలక్షి(70) దంపతుల కొడుకు నాగ మల్లేశ్వరరావు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తల్లిదండ్రుల ఆస్తి కోసం తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. అతడిపై పోలీసు కేసు కూడా పెట్టి జైల్లో వేసినా మార్పు రాలేదు. ఆ మానసిక వేధనతో తండ్రి ఈ ఏడాది జనవరి 19న చనిపోయాడు. తండ్రికి అంత్యక్రియలు చేయాలంటే ఆస్తి రాసివ్వాలని షరతు పెట్టాడు. దీంతో తల్లి ధనలక్ష్మి.. సగం వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, మిగతా ఆస్తి కోసం తల్లిని వేధించేవాడు. ఓ రోజు ఇంట్లో బంధించి తలుపులు వేశాడు. ఆమె ఇంటి వెనకాల తలుపు తీసుకొని పారిపోయింది.

    బాపట్లలో కుటుంబంతో ఉంటున్న కూతురి వద్ద ఉంటోంది. అయితే, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన ఆమె.. సోమవారం మధ్యాహ్నం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కూతురి భర్త లాక్‌డౌన్ కారణంగా విజయనగరంలో ఉండిపోయాడు. దీంతో.. తల్లి భౌతికకాయంతో మంగళగిరిలోని ఇంటికి చేరింది కూతురు. అయితే, తల్లి శవాన్ని ఇంట్లోకి రానిచ్చేందుకు నాగ మల్లేశ్వర రావు ఒప్పుకోలేదు. బంధువులు, స్థానికులు బతిమిలాడినా కనికరించలేదు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అదుపులోకి తీసుకొని అంత్యక్రియలు జరిపించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: