హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొడుకు ప్రేమపెళ్లి, యువతి బంధువుల దాడిలో తండ్రి మృతి

కొడుకు ప్రేమపెళ్లి, యువతి బంధువుల దాడిలో తండ్రి మృతి

లక్ష్మీ నారాయణ (File)

లక్ష్మీ నారాయణ (File)

కొడుకు తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి తరఫు బంధువుల ఆ యువకుడి తండ్రిపైదాడి చేశారు.

  కొడుకు తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి తరఫు బంధువుల ఆ యువకుడి తండ్రిపైదాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడి తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయినపల్లి మండలం స్థంబంపల్లికి చెందిన మహేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గౌతమి అనే యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లుగా వారి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో దసరా రోజు మహేష్, గౌతమిని తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి తండ్రి లక్ష్మినారాయణ పై దాడి చేశారు. మూడు రోజుల క్రితం వారు చేసిన దాడిలో గాయపడిన యువవకుడి తండ్రి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందతు మృతి చెందాడు. స్థంబంపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. గొంతు కోసుకుని చనిపోయిన యువతి

  తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ పెను విషాదం చోటు చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గొంతు కోసుకుని చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుములకున్నాయి. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్ లో మెరుగు దుర్గారావు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని పెద్ద కుమార్తె మాధురి (22)కి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన మాధురి గురువారం రాత్రి కత్తితో మెడకోసుకుని చనిపోయింది. అయితే ఆ యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. అయితే ఇది పరువు హత్య అన్న ప్రచారం సైతం సాగుతోంది. ఈ విషయంపై యువతి తండ్రిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. గర్భవతి అయిన యువతి

  ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో యువతి దారుణంగా మోసపోయింది. అతడి మాయమాటలకు వంచనకు గురై ఆ మైనర్‌ బాలిక గర్భం దాల్చింది. చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక తండాకు చెందిన సోనీ ( పేరు మర్చాం) అనే యువతి 10వ తరగతి పాస్ అయ్యింది. చదువుల్లో చురుగ్గా ఉండే ఆ యువతి కాలేజీలో చేరి తన కలలను నెరవేర్చుకోవాలనుకుంది. అప్పుడే ఆమె జీవితంలోకి సోమేష్ అనే యువకుడు ప్రవేశించాడు. సోమేష్ వృత్తిరీత్యా రాయచూరులో ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు. సోని ఉండే గ్రామంలో ఓ సారి పెళ్లికి అతిథిలా హాజరయ్యాడు. అక్కడే సోని అతడి దృష్టిలో పడింది. వెంటనే సోని స్నేహితుల ద్వారా ఆమె ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. తరచూ ఫోన్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, ప్రాణం ఇస్తాను అంటూ ఆమె వెంటపడ్డాడు. చివరకు సోని అతడి మయమాటలకు మోసపోయింది. అతడి ప్రేమకు అంగీకరించింది. రెండు నెలల పాటు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. సరిగ్గా మూడు నెలల క్రితం సోనీని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను తన లైంగిక వాంఛ తీర్చమని ఫోర్స్ చేశాడు. అందుకు ఆ బాలిక ససేమిరా అన్నది. పెళ్లి చేసుకున్న తర్వాతే అని తేల్చి చెప్పింది. అయినా సోమేష్ ఒప్పుకోలేదు. ఎలాగైనా తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. చివరకు సోనీ సరే అని ఒప్పుకుంది. సోమేష్ పశువాంఛకు సోని బలిపశువు అయ్యింది. అప్పటి నుంచి సోమేష్ అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఆ తర్వావత బాలిక గర్భవతి అయ్యింది. అవమానంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Sircilla, Telangana

  ఉత్తమ కథలు