తండ్రిని గొంతుకోసి చంపిన కొడుకు.. నిజామాబాద్‌లో దారుణం

కుటుంబ కలహాలతో ఇవాళ మధ్యాహ్నం చికెన్ షాపులోనే తండ్రీకొడుకులు గొడవపడ్డారు. ఒకరిపై మరొకరు కత్తి, రాడ్‌తో దాడి చేసుకున్నారు.

news18-telugu
Updated: May 26, 2020, 6:41 PM IST
తండ్రిని గొంతుకోసి చంపిన కొడుకు.. నిజామాబాద్‌లో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తలకొరివి పెడతాడనుకున్న కొడుకే తండ్రిని కడతేర్చాడు. కన్నతండ్రని కూడా చూడకుండా కిరాతకంగా హత్యచేశాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఖిల్లా గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..డిచ్‌పల్లి ఖిల్లాకు చెందిన వాహిద్ ఖాన్ (70), అతడి కుమారుడు అప్సర్ ఖాన్.. గ్రామంలో వాహిద్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఐతే కుటుంబ కలహాలతో ఇవాళ మధ్యాహ్నం చికెన్ షాపులోనే తండ్రీకొడుకులు గొడవపడ్డారు. ఒకరిపై మరొకరు కత్తి, రాడ్‌తో దాడి చేసుకున్నారు. అప్సర్ ఖాన్ కత్తితో తన తండ్రి గొంతు కోయడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అంతకుముందు వాహిద్ తన కుమారుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అప్సర్ ఖాన్ ముక్కు తెగింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో డిచ్‌పల్లి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: May 26, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading