• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SON KILLS HER MOTHER FOR NOT GIVING RYTHU BANDHU MONEY IN MAHABUBNAGAR SK

రైతుబంధు డబ్బులు ఇవ్వవా? పంటను గేదెతో తొక్కించి.. తల్లిని గొంతు నులిమి చంపిన తనయుడు

రైతుబంధు డబ్బులు ఇవ్వవా? పంటను గేదెతో తొక్కించి.. తల్లిని గొంతు నులిమి చంపిన తనయుడు

ప్రతీకాత్మక చిత్రం

తల్లి సాగు చేస్తున్న ఉల్లిపంటను ధ్వంసం చేశాడు. గేదెతో తోట మొత్తాన్ని తొక్కించేశాడు. అది చూసిన తల్లి తన కొడుకును దూషించింది. పంటను నాశనం చేసినందుకు తిట్టిపోసింది. ఐతే తను దూషించడంతో మల్లయ్య రెచ్చిపోయాడు.

  • Share this:
    డబ్బు కోసం.. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి కోసం.. అన్నాదమ్ముళ్లు చంపుకుంటున్నారు. రక్త సంబంధాన్ని కాదని కొట్టుకు చస్తున్నారు. కొందరైతే కన్న తల్లిదండ్రులను కూడా కడతేర్చుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. రైతు బంధు డబ్బుల కోసం కన్నతల్లిని చంపేశాడో కిరాతక కొడుకు. డబ్బులు ఇవ్వలేదని పంటను ధ్వంసం చేసి.. తల్లిని గొంతు నులిమి చంపేశాడు. గుండీడ్ మండలం నంచర్లలో ఈ దారుణం చోటుచేసుకుంది.

    నంచర్ల గ్రామానికి చెందిన నర్సమ్మ (65)కు ఎనిమిది మంది సంతానం. కుమారులు తిర్మలయ్య, మల్లయ్యతో పాలు ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. నర్సమ్మ పేరిట ఐదెకరాల పొలం ఉంది. అందులో కొత్త భాగాన్ని ఆమె సాగు చేస్తుండగా.. మిగతా భాగాన్ని ఇద్దరు కుమారులు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆస్తి పంపకాలు పూర్తి కాలేదు. ఉన్న భూమి మొత్తం తల్లి పేరిటే ఉంది. అందుకే రైతు బంధు డబ్బులు ఆమె ఖాతాలోనే పడతాయి. ఐతే ఆ డబ్బులు తనకు ఇవ్వలేదని చిన్న కుమారుడు మల్లయ్య తల్లితో వాగ్వాదం పెట్టుకునే వాడు. మాకు డబ్బులు ఇవ్వవా అని పలుమార్లు గొడవపడ్డాడు.

    ఈ క్రమంలోనే, సోమవారం పొలం వద్దకు వెళ్లిన మల్లయ్య.. తన తల్లి సాగు చేస్తున్న ఉల్లిపంటను ధ్వంసం చేశాడు. గేదెతో తోట మొత్తాన్ని తొక్కించేశాడు. అది చూసిన తల్లి తన కొడుకును దూషించింది. పంటను నాశనం చేసినందుకు తిట్టిపోసింది. ఐతే తను దూషించడంతో మల్లయ్య రెచ్చిపోయాడు. ఆగ్రహంతో తల్లిపై దాడి చేశాడు. ఆమెను గొంతు నులిమి చంపేశాడు. భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయపోగా.. రైతు బంధు డబ్బులు కూడా ఇవ్వడం లేదన్న కోపంతో.. కన్నతల్లినే కడతేర్చాడు. పోలీసులు మల్లయ్యను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు