Home /News /crime /

SON KILLS FATHER IF GIRLFRIEND REFUSES TO KEEP GIRLFRIEND AT HOME INCIDENT HAPPEND IN UTTAR PRADESH SSR

Shocking: ఈ పెద్దాయన పెద్ద కొడుకుకు మధ్య రాత్రి 2 గంటలకు మెలకువ వచ్చి చూస్తే.. ఏముంది..

అర్వింద్

అర్వింద్

ఉత్తరప్రదేశ్‌లో జరగరాని ఘోరం జరిగింది. కన్నతండ్రిని కొడుకే హత్య చేసిన ఘటనతో యూపీలోని భిఖేపూర్ ఉలిక్కిపడింది. తన కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చినందుకు ఆ తండ్రి అడ్డుచెప్పాడు. ఆమెను తిరిగి ఆమె ఇంటికి పంపించేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకు మధ్య జరిగిన గొడవ తండ్రి హత్యకు దారితీసింది.

ఇంకా చదవండి ...
    భిఖేపూర్: ఉత్తరప్రదేశ్‌లో జరగరాని ఘోరం జరిగింది. కన్నతండ్రిని కొడుకే హత్య చేసిన ఘటనతో యూపీలోని భిఖేపూర్ ఉలిక్కిపడింది. తన కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చినందుకు ఆ తండ్రి అడ్డుచెప్పాడు. ఆమెను తిరిగి ఆమె ఇంటికి పంపించేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకు మధ్య జరిగిన గొడవ తండ్రి హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఔరియా జిల్లాకు చెందిన అర్వింద్ కుమార్‌కు ఇద్దరు కొడుకులు. వీరిలో.. పెద్ద కొడుకు పేరు ప్రదీప్ కాగా.. చిన్న కొడుకు పేరు శివం. కొన్ని నెలలుగా శివం ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి ఇంట్లో ఇటీవల విషయం తెలిసింది. శివంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో.. శివం ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో అప్పటివరకూ అర్వింద్ కుమార్, శివం, ప్రదీప్ ఉంటున్నారు. శివం తన ప్రియురాలిని నేరుగా ఇంటికి తీసుకురావడంపై అతని తండ్రి అర్వింద్ అడ్డు చెప్పాడు. ఇది సరైన పద్ధతి కాదని.. ఆమెను వాళ్లింటి దగ్గర దిగబెట్టి రావాలని కొడుకుకు చెప్పాడు. అయితే.. శివం అందుకు తొలుత నిరాకరించినా.. తండ్రి కాదూకూడదని అనడంతో తప్పక తీసుకెళ్లి ఆ యువతికి వదిలిపెట్టి వచ్చాడు. తిరిగొచ్చాక తండ్రి అర్వింద్ కుమార్‌తో గొడవ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయంటే తనకు ఇష్టమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తన ఉద్దేశాన్ని తండ్రికి చెప్పాడు. అందుకు పద్ధతి ఇది కాదని కొడుకును అర్వింద్ కుమార్ మందలించాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య మొదలైన సోమవారం సాయంత్రం జరిగిన సంభాషణ గొడవకు దారి తీసింది. వాగ్వాదం పెరిగి చిలికిచిలికి గాలివానగా మారింది.

    క్షణికావేశంలో ఇనుప రాడ్‌తో తండ్రి తలపై అర్వింద్ కొట్టాడు. ఆ తర్వాత తండ్రి శవాన్ని బెడ్‌పై ఉంచి ఏం తెలియనట్టుగా శివం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అర్వింద్ పెద్ద కొడుకు ప్రదీప్ ఆ గొడవ సమయంలో ఇంట్లో లేడు. బయటకు వెళ్లిన ప్రదీప్ రాత్రి ఇంటికొచ్చి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మధ్య రాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూడగా.. తండ్రి గదిలో లైట్ వెలుగుతూ ఉండటాన్ని గమనించాడు. లోపలకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో తన తండ్రి అర్వింద్ శవం కనిపించింది. ఆ మృతదేహం పక్కన నెత్తుటి మరకలతో ఇనుప రాడ్ కనిపించింది. తన తమ్ముడికి విషయం చెబుదామని చూస్తే ఇంట్లో కనిపించలేదు. దీంతో.. ఏం జరిగిందో ప్రదీప్‌కు అర్థమైంది.

    ఇది కూడా చదవండి: Lovers: ఆగస్ట్ 3న నైట్ టైంలో లవర్‌ను కలిసేందుకు వాళ్లూరు వెళ్లాడు.. ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. ఆగస్ట్ 8న..

    పోలీసులకు ప్రదీప్ ఫోన్ చేయగానే ఖాకీలు స్పాట్‌కు చేరుకున్నారు. అర్వింద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు శివం కోసం గాలిస్తున్నారు. ఆ యువతిని తిరిగి పంపించిన దగ్గర నుంచి తండ్రితో శివం గొడవ పెట్టుకున్నాడని.. చంపుతానని కూడా బెదిరించాడని అర్వింద్ బంధువులు పోలీసులకు చెప్పారు. అర్వింద్ పెద్ద కొడుకు ప్రదీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Brutally, Crime news, Murder, Son kills father, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు