• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SON KILLS FATHER DUE TO NOT GIVING MONEY IN NEW DELHI VB

Murder: రూ.50 కోసం కన్న తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు.. అనంతరం అడ్డువచ్చిన తన తల్లిని కూడా.. ఏం జరిగిందంటే..

Murder: రూ.50 కోసం కన్న తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు.. అనంతరం అడ్డువచ్చిన తన తల్లిని కూడా.. ఏం జరిగిందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

Murder: రూ. 50 ఇవ్వమని తండ్రిని అడిగాడు ఆ కొడుకు. చదువుకున్నావు కదా.. ఏదైనా పని చేసుకోవచ్చుగా అని మందలించినందుకు తన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని భరత్ నగర్ లో చోటుచేసుకుంది.

  • Share this:
    దేశ రాజధాని ఢిల్లీ నేరాలకైనా, రాజకీయాలకైనా కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఢిల్లీ విస్తీర్ణం తక్కువ ఉండటంతో జనసాంద్రత అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. తరచూ కిడ్నాప్ లు, మర్టర్ లు, అత్యాచారాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే ఇక్కడ ఒకటి జరిగింది. కన్న కొడుకు ఖర్చులకు రూ.50 అడిగినందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో కోపంతో అతడు కన్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశారు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని భ‌ర‌త్ న‌గ‌ర్ ల్ అనిల్, తన తండ్రి మహేంద్రపాల్(70), అనిల్ తల్లి నివాసం ఉంటున్నారు. ఉద్యోగం చేయకుండా కుమారుడు జులాయిగా తిరుగుతూ తన తండ్రి వద్ద తరచూ ఖర్చులకు డబ్బులు అడిగేవాడు. ఏదో ఒక పని చేసుకో అని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోకుండా అలాగే ఉండేవాడు. ఈ మధ్యన తనకు రూ.50 కావాలని తన తండ్రిని అడిగాడు. దీంతో అతడు నిరాకరించి తన వద్ద లేవన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. అంతే కాకుండా త‌ర‌చూ డ‌బ్బులు అడుగుతుండ‌టంతో ఉద్యోగం చూసుకోవాల‌ని తండ్రి హిత‌వు ప‌ల‌క‌గా ఆవేశంతో క‌త్తితో ఆయ‌న‌పై దాడికి తెగ‌బ‌డ్డాడు.

    అతడి చాతిపై కత్తితో రెండు సార్లు పొడవగా అతడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలంలో దాడి చేస్తుండగా అడ్డువచ్చిన తనను కూడా గాయపర్చినట్లు.. స్వల్పగాయాలతో తను భయటపడినట్లు అనిల్ తల్లి పేర్కొంది.

    man assassinated sister law over suspicion murder at kukatpally vb Hyderabad Crime News brother in law, crime , crime news, telangana, hyderabd, brother in law , murder, brutally murder
    ప్రతీకాత్మక చిత్రం


    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. అనిల్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు