కన్నతల్లిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..

శుక్రవారం రాత్రి 9గంటలకు ఏదో విషయమై తల్లితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఆమె తలను గోడకేసి బాదాడు.

news18-telugu
Updated: March 30, 2019, 9:10 PM IST
కన్నతల్లిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 9:10 PM IST
మహారాష్ట్రలోని భయందర్‌లో కన్నతల్లిని కిరాతకంగా హత్య చేశాడో కొడుకు. వృద్దురాలు అన్న కనికరం కూడా లేకుండా తలను గోడకేసి చావబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసుల కథనం ప్రకారం.. భయందర్‌లోని మండ్వి చెరువు ప్రాంతంలో సోమ్‌నాథ్ మిత్ర(45) అతని తల్లి(70)తో కలిసి నివాసం ఉంటున్నాడు. తరుచూ తల్లితో గొడవపడటం నిత్యకృత్యమైపోయింది.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి 9గంటలకు ఏదో విషయమై తల్లితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఆమె తలను గోడకేసి బాదాడు. దీంతో తలకు తీవ్ర గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...