Attempt to murder: ఎప్పటిలాగే పొలం వద్దకు వెళ్లాడు.. శబ్ధం వచ్చే సరికి వెనక్కి తిరిగి చూశాడు.. అంతలోనే దారుణం.. రక్తపు మడుగులో..

జలాల్ పూర్ గ్రామంలో హత్యకు గురైన నునావత్ కిషన్

Attempt to murder: ఉమ్మడిమెదక్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో సొంత పెదనాన్న పై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన జిల్లా లో సంచలనం సృష్టించింది.

 • Share this:
  సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. కొంతమంది మాత్రం మూఢనమ్మకాలు.. మంత్రాలు.. తంత్రాలు అంటూ భయాందోళనల మధ్య గడుపుతూ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మూఢ‌న‌మ్మ‌కాలపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా గ్రామాలలో మాత్రం బాణావతి అనుమానంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటునే ఉన్నారు. అమ‌యాకులను హింసిస్తున్నారు. తాజాగా తన చెల్లెలు అనారోగ్యం పడటానిక తన పెదనాన్న కారణం అన్న నెపంతో అతటి తమ్ముడి కొడుకు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఉమ్మడిమెదక్ జిల్లా లో చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో సొంత పెదనాన్న పై కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన జిల్లా లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

  మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ తండాకు చెందిన నూనావత్ కిషన్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా కిషన్ తమ్ముని కూతురు తరచూ అనారోగ్యానికి గురవుతోంది. దీనికి తోడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి వివాదాలు జరుగుతున్నాయి. తన పెదనాన్న కిషన్ తమ కుటుంబ సభ్యులపై మంత్రాలు చేయడం వల్లనే తన చెల్లెలు అనారోగ్యానికి గురవుతోందని ,ఆమె కాపురం నిలబడడం లేదని అనుమానంతో కిషన్ తమ్ముని కొడుకు నరసింహ భావించాడు. తన పెదనాన్న పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న నరసింహ ఇటీవల గ్రామంలో కి వచ్చాడు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగాడు. సాయంత్రం వేళ నూనావత్ కిషన్ పొలం పనులకు వెళ్లగా.. అక్కడికి వెళ్లిన నరసింహ కిషన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అక్కడే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా గ్రామస్తులకు సమాచారం తెలిసింది.

  విషయం తెలుసుకున్న తండావాసులు కిషన్ ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ కిషన్ మృతి చెందాడు. నరసింహ ను స్థానిక ఎస్సై మహేందర్ , సీఐ స్వామి గౌడ్ అదుపులో కి తీసుకొని విచారించగా తన పెద్ద నాన్నను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. మూఢ‌న‌మ్మ‌కాల పై ప్రభుత్వ లు ఎన్ని చట్టాలు తెచ్చిన గ్రామాలలో మాత్రం బా భానుమతి పేరుతో కొన్ని కుటుంబాలు రోడ్లపైకి వస్తున్నాయి.

  గిరిజన తాండాల్లో ఈ మూఢ నమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ జ్వరం వచ్చినా, అనుమానం వచ్చిన వ్యక్తిపై బాణమతి చేస్తున్నారని అనుమానంతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు జరిపి వారి కుటుంబాలను నడిరోడ్డుపై తెచ్చుకుంటున్నారు. మూఢ నమ్మకాలపై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా గ్రామం లో మాత్రం బాణమతి చేస్తున్నారని పల్లెటూర్లలో చిన్న పిల్లలకు జ్వరం వచ్చిన బాణమతి పేరుతోనే వస్తుందని ఆ గ్రామంలో పసికట్టి ఘర్షణ చేస్తున్నారని గిరిజన తండా వాసులు ఆరోపణలు చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: