• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SON KILLED MOTHER DUE TO FIGHTING WITH HIS WIFE REGULARLY IN MAHABUBNAGAR WANAPARTHY DISTRICT FULL DETAILS HERE HSN

Mahabubnagar: శివయ్యా.. ఎంతపని చేశావయ్యా..? ఎనిమిది నెలల క్రితం పెళ్లి.. అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవ.. చిరాకొచ్చి ఒకరిని చంపేసిన కొడుకు..!

Mahabubnagar: శివయ్యా.. ఎంతపని చేశావయ్యా..? ఎనిమిది నెలల క్రితం పెళ్లి.. అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవ.. చిరాకొచ్చి ఒకరిని చంపేసిన కొడుకు..!

నిందితుడు శివ (ఫైల్ ఫొటో)

అత్తాకోడళ్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. వారిద్దరి వాదులాటలు చూసి కొడుక్కు చిరాకొచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని..

  • Share this:
    ఎనిమిది నెలల క్రితమే కొడుక్కు పెళ్లయింది. కారణమేమిటో కానీ ఆ అత్తాకోడళ్లకు మాత్రం క్షణం కూడా పడేది కాదు. ఇద్దరి మధ్య తరచూ మాటల యుద్ధం జరిగేది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య గొడవలతో కొడుక్కు విసుగొచ్చింది. తరచూ గొడవలు పడుతుండటంతో చిరాకొచ్చింది. గొడవ పడుతున్న వారిని ఆగమని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అంతే, ఆగ్రహంతో ఒకరి ప్రాణాన్ని తీసేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన మంకలి నర్సయ్య, కాశమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి కురుమయ్య, శివ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

    శివకు ఎనిమిది నెలల క్రితమే పెళ్లయింది. అదే గ్రామానికి చెందిన రేణుక అనే యువతితో ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచే అత్తాకోడళ్ల మధ్య నిత్యం యుద్ధమే జరిగేది. మాటలతో దుర్భాషలాడుకునేవారు. గొడవ పడొద్దని ఇంట్లో వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా వినేవాళ్లు కాదు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై శివకు తీవ్ర ఆగ్రహం ఉండేది. శుక్రవారం రాత్రి కూడా ఓ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. గొడవ పడొద్దని వారించినా వినలేదు.
    ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

    ఈ గొడవ గురించి మనస్తాపం చెందిన కాశమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కోడలు అత్తచేతిలోని అగ్గిపెట్టెను లాక్కుంది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా శివలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి మెడపై నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే మరణించింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. శివ, అతడి భార్య రేణుకను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
    Published by:Hasaan Kandula
    First published: