హరిద్వార్‌లోని బహద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్గుబ్‌పూర్ గ్రామంలో జరిగిన జంట హత్య అందరి హృదయాలను కదిలించింది. భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇద్దరి జీవితాలు ముగిశాయి. గొడ్డలితో భర్తను హతమార్చింది భార్య. తండ్రి మరణాన్ని చూసిన కుమారుడు తౌహిద్ కూడా సవతి తల్లి గొంతుకోసి హత్య చేశాడు. తల్లిని హతమార్చిన తర్వాత నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కథంతా చెప్పాడు. యువకుడి మాటలు విన్న పోలీసులు తొలుత ఆశ్చర్యపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా భార్యాభర్తల మృతదేహాలు పడి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
సమాచారం మేరకు మృతుల భార్యాభర్తల పేర్లు ఇనాముల్హాక్, సితార. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. లూథియానాలో సితార ఒంటరిగా నివసించేది. ఆమె శనివారం రాత్రి తన సామాన్లతో గ్రామానికి వచ్చింది. ఊరికి వచ్చిన తర్వాత సితార సవతి పిల్లలతో గొడవలు పెట్టుకుందని చెబుతున్నారు. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి గురైన సితార తన భర్త ఇనాముల్హాక్ను గొడ్డలితో నరికి చంపింది. తండ్రి హత్య విషయం తెలుసుకున్న కొడుకు తౌహిద్ ఇంటికి చేరుకుని కోపంతో సవతి తల్లిని గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. శనివారం రాత్రి ఇనాముల్హాక్ జమీల్, అతని భార్య సితార మధ్య గొడవ జరిగినట్లు బహద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నితీష్ శర్మ తెలిపారు. కోపంతో సితార భర్తను చంపేసింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో జంట హత్యకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. సితార ఇనాముల్హాక్ రెండవ భార్య. ఇనాముల్హాక్ మొదటి భార్య పదేళ్ల క్రితం చనిపోగా, రెండేళ్ల క్రితం సితారతో వివాహమైంది. సితార కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఆమె తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆమెకు మొదటి భర్త నుండి ఒక కుమార్తె కూడా ఉంది.
Land grabbing : రాజకీయ పలుకుబడితో 12ఎకరాల భూమి స్వాహా .. పట్టాలు సృష్టించుకున్న మున్సిపల్ చైర్మన్
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంట్లోనే రోమాన్స్.. పలుమార్లు హెచ్చరించిన అన్న.. చివరకు
నిందితుడు తౌహిద్‌కు 10 మంది తోబుట్టువులు. నిందితుడి వయస్సు 22 ఏళ్లు. హత్య జరిగినప్పుడు తౌహిద్ తమ్ముడు, సోదరి ఇంట్లో ఉన్నారు. పోలీసులు తౌహిద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Wife kills husband