విద్యార్థులకు సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నారు. భయట పరిస్థితులు చూస్తే కరోనా మహమ్మారి విస్తరిస్తుంది. దీంతో ఎటూ వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ ఫోన్ లేదా.. టీవీ చూస్తూ విద్యార్థులు కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది పుస్తకాలు తీసుకొని చదువుతున్నారు. మరి కొంత మంది వాటికి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటున్న తన కొడుకును చదువుకోమని సలహా
ఇచ్చాడు ఓ తండ్రి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగానే ఉంటున్నావ్ గా.. పుస్తకం పట్టి గంటసేపైనా చదువు అని మందలించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు యువకుడు పక్కనే ఉన్న కత్తెరతో తన తండ్రి మెడలో పొడిచి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో బంటు ఎల్లయ్య(45), లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో కొడుకు నాగేందర్(19), కూతురు భవాని. నాగేందర్ సూర్యాపేటలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నాగేందర్ కి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్త పెద్దదిగా మారింది. నాగేందర్ ఆవేశంలో కత్తెరతో తండ్రి గొంతులో పొడిచాడు.
ఎల్లయ్య అక్కడే రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే స్థానికులు వచ్చి ఎల్లయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to murder, Crime, Crime news, Father, Murder, Nalgonda, Pamulaphad, Son, Study, Telangana