తండ్రిని చంపి ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు...కాకినాడలో ఘోరం

మద్యం తాగొచ్చి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఇంటి పక్కనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. ఐతే తండ్రిని తానే చంపానని ఇటీవల బాబాయితో అతడు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: June 10, 2019, 3:47 PM IST
తండ్రిని చంపి ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు...కాకినాడలో ఘోరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిత్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో తండ్రిని చంపేశాడో యువకుడు. తల్లితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం పరిధిలో ఈ ఘోరం జరిగింది. 2 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే..గోపిరెడ్డి ఈశ్వరరావు దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్ళిళ్లు జరిగాయి. అందరూ అమ్మాయిలే కావడంతో కుమార్ అనే బాబున దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇప్పుడా దత్తపుత్రుడి వయసు 21 ఏళ్లు.

ఐతే గోపిరెడ్డి ఈశ్వరరావు నిత్యం మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులు వేధిస్తుండేవాడు. ఎంత చెప్పినా అతని ప్రవర్తనతో మార్పు లేకపోవడంతో భార్యా పిల్లలు విసిగిపోయారు. ఈ క్రమంలోనే తల్లితో కలిసి తండ్రిని ఈశ్వరరావును దారుణంగా హతమార్చాడు కుమార్. మద్యం తాగొచ్చి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఇంటి పక్కనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. ఐతే తండ్రిని తానే చంపానని ఇటీవల బాబాయితో అతడు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తాను తండ్రిని చంపిన విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో కుమార్ మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు కాకినాడ ప్రభుత్వాస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: June 10, 2019, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading