విషాదం.. కన్నతల్లిని సాకలేక.. కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన తనయుడు..

తల్లి వ‌ృద్ధురాలు కావడంతో ఆమెను స్వగ్రామంలోనే ఉంచి వెళ్లాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో లింగస్వామి పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు.

news18-telugu
Updated: May 27, 2020, 8:51 AM IST
విషాదం.. కన్నతల్లిని సాకలేక.. కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన తనయుడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సభ్యసమాజం నివ్వెరపోయే ఘటనిది. మంచంపట్టిన కన్నతల్లిని సాకలేక ఓ తనయుడు కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన దారుణమిది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన తిరుమల శాంతమ్మ(55) కొడుకు తిరుమల లింగస్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లాడు. తల్లి వ‌ృద్ధురాలు కావడంతో ఆమెను స్వగ్రామంలోనే ఉంచి వెళ్లాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో లింగస్వామి పది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శాంతమ్మ కొద్దిరోజులుగా వృద్ధురాలు కావడం.. అనారోగ్య సమస్యల కారణంగా మంచం పట్టింది. ఈ క్రమంలో లింగస్వామి తన తల్లికి సాకలేకపోయాడు. మంగళవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్న తల్లి శాంతమ్మపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. దీంతో శాంతమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
First published: May 27, 2020, 8:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading