పుట్టు వెంట్రుకల ఫంక్షన్‌కు వచ్చి.. కానరాని లోకాలకు..

హతుడు వెంకటేశ్వర్లు అల్లుడైన నిందితుడు గోపి తరచూ తన భార్య వెంకటలక్ష్మిని ఎందుకు కొడుతున్నావని, శారీరకంగా ఎందుకు హింసిస్తున్నావని ప్రశ్నించాడు.

news18-telugu
Updated: June 25, 2020, 6:23 AM IST
పుట్టు వెంట్రుకల ఫంక్షన్‌కు వచ్చి.. కానరాని లోకాలకు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తి క్షణికావేశంలో మనుమడి పుట్టు వెంట్రుకల వచ్చిన ఏకంగా పిల్లను ఇచ్చిన మామనే హత్య చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణానికి చెందిన చింతల గోపి తన కుమారుడు రిత్విక్ పుట్టు వెంట్రుకల ఫంక్షన్‌కు ఈనెల 20న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నందిగామ నుంచి అతనికి పిల్లనిచ్చిన మామ అయిన వంటిపులి వెంకటేశ్వర్లు, నిందితుని బావమరుది ప్రకాష్‌లు వచ్చారు. ఫంక్షన్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బావమరిది తిరిగి నందిగామకు వెళ్లిపోగా నిందితుని మామ, హతుడు వెంకటేశ్వర్లు తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లడం కోసం ఇక్కడే ఉండిపోయారని తెలిపారు. మరుసటి రోజు నిందితుడు గోపి, హతుడు వెంకటేశ్వర్లు మామ, అల్లుడు ఇద్దరు కలిసి ఇంట్లోనే మద్యం సేవించారు.

అయితే ఇదే సమయంలో హతుడు వెంకటేశ్వర్లు అల్లుడైన నిందితుడు గోపి తరచూ తన భార్య వెంకటలక్ష్మిని ఎందుకు కొడుతున్నావని, శారీరకంగా ఎందుకు హింసిస్తున్నావని ప్రశ్నించాడు. దీంతో అల్లుడు ఆవేశంతో ఇంట్లో ఉన్న రోకలి బండతో మామ వెంకటేశ్వర్లుపై దాడికి ప్రయత్నించగా కుతురైన వెంకటలక్ష్మి అడ్డుకున్నది. ఇదే సమయంలో పక్కనే ఉన్న రోలుతో మామ తల మీద బలంగా బాదాడు.

వెంటనే బిడ్డ, చుట్టు పక్కల వారితో కలిసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారణ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
First published: June 25, 2020, 6:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading