Telangana : రెండు నెలల క్రితం చనిపోయిన అత్త..అల్లుడి ఓవరాక్షన్ తో వెలుగులోకి నిజం..ట్విస్ట్ ఇదే..

రెండు నెలల క్రితం చనిపోయిన అత్త..అల్లుడి ఓవరాక్షన్ తో వెలుగులోకి నిజం..ట్విస్ట్ ఇదే..

Telangana : ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే డబ్బు, ఆస్థిపాస్తులే ముఖ్యమైపోయాయి. ఆస్తికోసం ఎంతటి దారుణానికైనా తెగించే మనుషులు కూడా సమాజంలో ఉన్నారు.

  • Share this:
    ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే డబ్బు, ఆస్థిపాస్తులే ముఖ్యమైపోయాయి. ఆస్తికోసం ఎంతటి దారుణానికైనా తెగించే మనుషులు కూడా సమాజంలో ఉన్నారు. డబ్బు కోసం.. మానవ సంబంధాల్ని మంటగలుపుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ కూతురు జిల్లా ఎస్సీని ఆశ్రయించింది. కూతురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు..రెండు నెలల క్రితం చనిపోయిన బాధితురాలి తల్లి మృతదేహనికి తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నజీమా బేగం కొద్దికాలంగా కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లోని తన కూతురు వద్దే ఉంటోంది. గత డిసెంబర్‌లో నజీమా హఠాన్మరణం చెందింది. గుండెపోటుతో చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. అత్త చనిపోయి రెండు నెలలు తిరగకుండానే ఆమె ఆస్తులపై అల్లుడి కన్ను పడింది.

    ఆస్తులు అమ్మేద్దామంటూ ఒత్తిడి చేయడంతో కూతురికి అనుమానమొచ్చింది. తల్లి ఒంటిపై గాయాలు కూడా గుర్తుకొచ్చి తన తల్లిని హత్య చేశారంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. తన తల్లిని భర్త, మేనమామ కలిసి హతమార్చారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.

    బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 75 రోజుల తర్వాత నజీమా మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసు విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published: