సంక్రాంతి రోజు అత్తింట్లో అల్లుడి ఘాతుకం...కత్తులతో దాడి చేసి...

స్వప్న తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటినుండి స్వప్న బిక్నూర్ లోని తల్లిగారి ఇంట్లోనే ఉంటుంది.. దీంతో అత్తమామల పై కక్ష పెంచుకున్న గోపాల్ బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకొని ఇంటి తలుపులు తట్టగా వారు తలుపులు తెరవగానే అకస్మాత్తుగా లోనికి ప్రవేశించి తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా కుటుంబ సభ్యుల పై కత్తితో దాడి చేసాడు.

news18-telugu
Updated: January 16, 2020, 11:50 AM IST
సంక్రాంతి రోజు అత్తింట్లో అల్లుడి ఘాతుకం...కత్తులతో దాడి చేసి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సంక్రాంతి పండుగ రోజు తన కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్న ఓ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జర్రి గల రాములు శోభా దంపతులకు ముగ్గురు కుమార్తెలు.. చిన్న కుమార్తె స్వప్నకు మెదక్ కు చెందిన గోపాల్ కు ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. మెదక్ లో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే గోపాల్ దంపతులకు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. గత కొన్ని రోజులుగా గా డబ్బులు తీసుకు రావాలి అంటూ భార్యను వేధించసాగాడు. కుటుంబ కలహాలతో విసిగిపోయిన స్వప్న తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటినుండి స్వప్న బిక్నూర్ లోని తల్లిగారి ఇంట్లోనే ఉంటుంది.. దీంతో అత్తమామల పై కక్ష పెంచుకున్న గోపాల్ బుధవారం సాయంత్రం ఇంటికి చేరుకొని ఇంటి తలుపులు తట్టగా వారు తలుపులు తెరవగానే అకస్మాత్తుగా లోనికి ప్రవేశించి తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా కుటుంబ సభ్యుల పై కత్తితో దాడి చేసాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వారు తప్పించుకోవడానికి వెనుక డోర్ నుంచి బయటకు రాగా పక్కనున్న వారు అరుపులు గమనించి అతనిని అడ్డుకున్నారు. వారిని కూడా గాయపరిచి అక్కడి నుండి పారిపోయాడు.

పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఆ కుటుంబ సభ్యులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>