Home /News /crime /

SON IN LAW KILLED MOTHER IN LAW AFTER AN ARGUMENT ABOUT LAND ISSUE IN SRIKAKULAM DISTRICT FULL DETAILS HERE HSN

Srikakulam: చుట్టపుచూపుగా కూతురి ఇంటికి వచ్చిన అత్త.. పెద్ద అల్లుడి నిర్వాకంతో రాత్రికి రాత్రే శవంగా.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెద్ద కుమార్తెను చూడాలని ఆమెకు అనిపించింది. దీంతో తన కొడుకులకు చెప్పి పెద్ద అల్లుడి ఇంటికి వెళ్లింది. అక్కడే ఊహించని ఘోరం జరిగిపోయింది. చుట్టపుచూపుగా వెళ్లిన ఆ వృద్ధురాలు తెల్లారే సరికి శవమై కనిపించింది.

    ఒకటి కాదు రెండు కాదు 30 ఏళ్ల క్రితమే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసింది. చిన్న కుమార్తెకు కూడా కొన్నేళ్ల క్రితమే వివాహం చేసింది. ఇద్దరు కుమారుల వద్ద చెరో నెల ఉంటూ ఆ వృద్ధురాలు కాలం గడుపుతోంది. అయితే తన పెద్ద కుమార్తెను చూడాలని ఆమె భావించింది.. పెద్ద అల్లుడి ఇంటికి వెళ్లింది. అక్కడే ఊహించని ఘోరం జరిగిపోయింది. చుట్టపుచూపుగా వెళ్లిన ఆ వృద్ధురాలు తెల్లారే సరికి శవమై కనిపించింది. పెద్ద అల్లుడి నిర్వాకంతో ఆమె దారుణ హత్యకు గురయింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పెద్ద కొంగరాం గ్రామానికి చెందిన 65 ఏళ్ల వయసున్న అమ్మాయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. తన పెద్ద కుమార్తెతో చిట్టి ప్రసాద్ అనే వ్యక్తికి 1990వ సంవత్సరంలో పెళ్లి చేసింది.

    ఆ రోజుల్లోనే కట్నంగా 33 సెంట్ల భూమిని ఇచ్చింది. పెళ్లి నాటి నుంచి కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కలహాలు లేకుండా ఆ జంట జీవించసాగింది. అయితే ఇటీవల తన పెద్ద కుమార్తెను, అల్లుడిని చూసేందుకు శ్రీకాకుళం నగరంలో ఉంటున్న వాళ్ల ఇంటికి వచ్చింది. మూడు రోజులుగా పెద్ద అల్లుడి ఇంట్లోనే ఉంటోంది. అయితే ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం అల్లుడు, అత్త మధ్య ఓ విషయమై చర్చ జరిగింది. తన పేరు మీద ఉన్న మరో ఆరు సెంట్ల భూమిని చిన్న కుమార్తెకు రాసి ఇస్తానని ఆమె చిట్టి ప్రసాద్ కు చెప్పింది. ఈ విషయమై ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఆ స్థలాన్ని కూడా తనకు ఇవ్వాలని చిట్టి ప్రసాద్ పట్టుబట్టాడు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

    ఆమె ఇవ్వనని తేల్చేసింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ వాగ్వాదం చివరకు ఉగ్రరూపం దాల్చింది. చిట్టి ప్రసాద్ సహనం కోల్పోయాడు. ఎన్నిసార్లు బతిమిలాడినా, బెదిరించినా అత్త వినకపోవడంతో ఇంట్లో ఉన్న రోకలి బండతో అమ్మాయమ్మ తలపై బాదాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావం జరుగుతుండగానే అమ్మాయమ్మను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే శుక్రవారం రాత్రి ఆమె మరణించింది. మృతురాలి కుమారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పెద్ద అల్లుడి కోసం గాలిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ఓ ఇంటి ముందు టెంటు వేసి.. కుర్చీలో కూర్చుని కూలింగ్ వాటర్ తాగుతూ నిరసన.. ఇంతకీ అసలేం జరిగిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Srikakulam, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు