news18-telugu
Updated: June 21, 2020, 10:54 PM IST
ప్రతీకాత్మక చిత్రం
వారిద్దరూ భార్యభర్తలు. బతుకుదెరువు కోసం వేరే ప్రాంతానికి వచ్చారు. ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా ఘర్షణ జరుగుతోంది. ఇది తెలుకున్న పిల్లనిచ్చిన మామ.. కూతురు, అల్లుడికి సర్ది చెప్పేందుకు వచ్చాడు. కానీ మామ అల్లుడికి మాటామాటా పెరిగింది. దీంతో అల్లుడు పక్కన ఉన్నరోలుతో మామను కొట్టి చంపేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చింతల గోపి, వెంకటలక్ష్మీ భార్యభర్తలు. గతకొద్ది రోజులుగా నల్లగొండలో పాత సామాగ్రి వ్యాపారం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం గుంటూరు జిల్లా నందిగామ నుంచి ఇక్కడికి వసల వచ్చారు. ఇటీవల గోపి.. తన భార్య వెంకటలక్ష్మీతో నిత్యం ఘర్షణ పడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న వెంకటలక్ష్మీ తండ్రి ఒంటిపల్లి వెంకటేశ్వర్లు(45) నాలుగు రోజుల క్రితం గుంటూరు జిల్లా బాపట్ల నుంచి నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం మామ అల్లులిద్దరూ మద్యం తాగారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. అయితే గోపి తన పక్కనే ఉన్న రోలు తీసుకుని వెంకటేశ్వర్లు తలపై బలంగా కొట్టాడు.
దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకులాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
First published:
June 21, 2020, 10:54 PM IST