హోమ్ /వార్తలు /క్రైమ్ /

అత్త వివాహేతర సంబంధం... అల్లుడి ఆత్మహత్య.. తనకే పాపం తెలియదన్న కూతురు

అత్త వివాహేతర సంబంధం... అల్లుడి ఆత్మహత్య.. తనకే పాపం తెలియదన్న కూతురు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా పెళ్లైన ఆ అల్లుడు.. అత్త విషయమై భార్యతో తరుచూ గొడవలు పడి.. వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఓవైపు అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేధింపులు.. మరోవైపు భార్య తో మనస్పర్థలు అతడి ఉసురు తీశాయి.

  • News18
  • Last Updated :

అత్త వివాహేతర సంబంధం ఒక అల్లుడి ప్రాణాలు తీసింది. తన పని తాను చేసుకుంటుంటే మధ్యలో అల్లుడు పానకంలో పుడకలా తయారయ్యాడని భావించిన ఆ అత్త... బాధితుడిపై వేధింపులకు పాల్పడింది. దీంతో కొత్తగా పెళ్లైన ఆ అల్లుడు.. అత్త విషయమై భార్యతో తరుచూ గొడవలు పడి.. వారిద్దరి మధ్య మనస్పర్థలు పొడచూపాయి. ఓవైపు అత్త, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేధింపులు.. మరోవైపు భార్య తో మనస్పర్థలు అతడి ఉసురు తీశాయి.. అసలేం జరిగిందంటే...?

హైదరాబాద్ లోని మీర్ పేటలో చోటు చేసుకుందీ ఘటన. నల్లగొండ జిల్లా తిరుమలగిరి కి చెందిన అంగోతు బాబు (25) హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిది నెలల క్రితమే చందంపేట మండలం తెల్దార్ పల్లికి చెందిన యువతితో వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ లో గల శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. చీటికి మాటికి గొడవ పడుతుండటంతో బాబు తండ్రి రాములు వచ్చి విషయం ఆరా తీశాడు. అప్పుడు బాబు అసలు విషయం చెప్పాడు.

తన అత్త వివాహేతర సంబంధం పెట్టుకున్నదని.. ఆ విషయం తనకు తెలిసేసరికి.. ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి ఆమె కూడా తనను వేధింపులకు గురిచేసస్తున్నారని బాబు వాపోయాడు. ఇదే విషయంపై తన భార్యతో కూడా గొడవలు వస్తున్నాయని తెలిపాడు. దీంతో వారిద్దరినీ పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇప్పించాడు రాములు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. పోగా.. వాగ్వాదాలు ఇంకా ముదిరాయి. దీంతో బాబు భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో బాబు అత్తతో సన్నిహితంగా ఉండే వ్యక్తి.. అతడికి ఫోన్ చేసి బెదిరించేవాడు. అత్త కూడా ఫోన్ చేసి మానసిక వేధింపులకు గురి చేసేది.

వేధింపులతో విసిగిపోయిన బాబు కొద్దికాలంగా ముభావంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బాబు తమ్ముడు జబ్బర్ ఆటో తీసుకుని బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం బయటనుంచి వచ్చి చూసేసరికి తలుపు గడియపెట్టి ఉంది. జబ్బర్ తో పాటు అతడి చెల్లెలు, ఇంటి యజమాని తలుపును తెరిచి చూడగా.. ఎదురుగా బాబు శవం ఫ్యాన్ కు వేలాడి ఉంది. అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన కుమారుడిని అతడి అత్త వేధింపులకు గురి చేసిందని.. అత్తతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి బెదిరింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ చేపట్టారు. అయితే బాధితుడి భార్య మాత్రం తనకేం పాపం తెలియదని.. తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని తాను ఊహించలేదని చెప్పుకురావడం కొసమెరుపు.

First published:

Tags: Crime, Crime news, Extramarital affairs, Hyderabad, Illegal affair, Nalgonda, Suicide

ఉత్తమ కథలు