హోమ్ /వార్తలు /క్రైమ్ /

అత్తింట్లోని కూతురికి ఫోన్లో సలహాలు ఇస్తున తల్లి.. రగిలిపోయి రాడ్డుతో కొట్టి చంపిన అల్లుడు

అత్తింట్లోని కూతురికి ఫోన్లో సలహాలు ఇస్తున తల్లి.. రగిలిపోయి రాడ్డుతో కొట్టి చంపిన అల్లుడు

అత్తను రాడ్డుతో కొట్టిచంపిన అల్లుడు

అత్తను రాడ్డుతో కొట్టిచంపిన అల్లుడు

కొత్తగా పెళ్లైన అమ్మాయి... అత్తారింట్లో అడుగుపెట్టాక... రకరకాల భయాలు ఉంటాయి. వాటిని ఆమె తన తల్లితో పంచుకోవడమే తప్పైపోయిందా? అసలు ఆ అల్లుడు అత్త ప్రాణాలు ఎందుకు తీశాడు?

హిమాచల్ ప్రదేశ్... బిలాస్‌పూర్... మక్డీ మార్కండ్ పంచాయతీలో జరిగిన హత్య పోలీసులకే షాక్ ఇచ్చింది. అల్లుడే అత్తను రాడ్డుతో కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది. రాడ్డుతో కొట్టాక అల్లుడు పారిపోగా... తీవ్ర గాయాలపాలైన ఆమెను... స్థానిక మార్కండ్ ఆస్పత్రికి తరలించారు. కానీ... గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో... ఆస్పత్రి డాక్టర్లు తమ వల్ల కాదన్నారు. అక్కడి నుంచి ఆమెను బిలాస్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా డాక్టర్లు... అంత తీవ్రమైన గాయాల్ని తాము సెట్ చెయ్యలేని చెప్పడంతో... ఆక్కడి నుంచి సిమ్లాలోని IGMCకి తరలించారు. అక్కడికి తీసుకెళ్లేలోపే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కేసు వివరాలు:

అత్త సీతాదేవికి ఆరుగురు కూతుర్లు. వారిలో ఒక కూతుర్ని... బలా భులానా పంచాయతీకి చెందిన సురేష్ కుమార్‌కి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత... కూతురు అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తమామల నుంచి ఎలాంటి సమస్యలూ లేవు. సమస్యల్లా భర్తతోనే. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. పెళ్లి సమయంలో... ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులు దాచిపెట్టారు. తీరా పెళ్లయ్యాక... మీకు తాగుడు అలవాటు ఉందా... అని భార్య అడిగితే... "ఎవరికి లేదు ఈ భూమ్మీద... అందరూ తాగుతారు... దీన్ని పెద్ద మ్యాటర్ చెయ్యకు... లైట్ తీస్కో" అన్నాడు. కానీ అది ఆమెకు నచ్చలేదు.

ఎలాగైనా భర్తకు మద్యం అలవాటు మాన్పించాలి అనుకున్న ఆమె... తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తల్లి తనకు ఉన్న అనుభవంతో... తెలిసీ తెలియనివి ఏవేవో సలహాలు ఇచ్చింది. వాటిని ఆమె భర్తపై ప్రయోగించింది. ఇలా చాలాసార్లు చేస్తుండటంతో... మీ తల్లితో ఫోన్‌లో మాట్లాడొద్దు... అని సీరియస్ అయ్యాడు. దాంతో... ఆమె అదే విషయాన్ని తల్లికి చెప్పింది. దాంతో ఆగ్రహించిన తల్లి... నిన్నూ, నన్నూ వేరు చెయ్యాలనుకుంటున్నాడు... నువ్వు ఆత్తారింట్లో అడుగుపెట్టినా... నా కూతురివే... అంటూ... మాటలు కంటిన్యూ చేసింది.

రోజురోజుకూ తాగుడు ఎక్కువైన సురేష్... అత్తపై కోపం పెంచుకున్నాడు. తన తాగుడు తన ఇష్టం... దాన్ని మాన్పించాలనే ఆలోచన అత్తకు ఎందుకు... అంటూ లోలోపల రగిలిపోయాడు. రాన్రానూ అతనిలో ఈ ఆవేశం ఎక్కువైంది. తాజాగా తాగిన మత్తులో ఆమె ఇంటికి వెళ్లాడు. ఓ రాడ్డుతో... అత్త తల పగలగొట్టాడు. ఇలా ఒకసారి కాదు... వెంటవెంటనే చాలాసార్లు కొట్టేశాడు. ఆమె అరుపులతో... చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూడగానే... అల్లుడు పారిపోయాడు.

ఇది కూడా చదవండి: అమ్మా... మావయ్య ఒళ్లంతా తడుముతున్నాడు.. ఏం చెయ్యను.. ఆ వివాహిత ఏం చేసిందంటే...

ఇలా అత్తారింట్లో ఉండే కూతురితో తల్లి నాలుగు మాటలు మట్లాడటమే తప్పైపోయింది. మద్యం తాగొద్దంటే... మర్డర్ చేశాడు. అత్త ప్రాణాలు తీసేశాడు. సాదర్ బిలాస్‌పూర్ డిఎస్పీ రాజ్ కుమార్... ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. పారిపోయిన సురేష్‌ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పోస్ట్‌మార్టం తర్వాత సీతాదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

First published:

Tags: Crime news, Himachal Pradesh

ఉత్తమ కథలు