'బర్త్ డే' రోజే విషాదం.. కొడుకు చేసిన పనికి ఆ తండ్రి ఏం చేశాడంటే..

స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో బయటకెళ్లి పెట్రోల్ సీసాతో తిరిగొచ్చాడు. పెట్రోల్ ఒంటిపై పోసుకోవడానికి సిద్దపడగా.. తండ్రి అడ్డుపడి తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.

news18-telugu
Updated: May 17, 2019, 5:39 PM IST
'బర్త్ డే' రోజే విషాదం.. కొడుకు చేసిన పనికి ఆ తండ్రి ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 5:39 PM IST
'స్నేహితులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవాలి.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా?' అని ఆ యువకుడు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంట్లో డబ్బులు లేవని చెప్పినా వినకుండా వారిని వేధించాడు. తల్లిదండ్రులు పదేపదే డబ్బులు లేవని చెప్పడంతో.. బయటకెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చాడు. పుట్టినరోజు నాడే చనిపోతానని వారిని బెదిరించాడు. దీంతో అతని తండ్రి అడ్డుపడి.. ఆ చావేదో మేమే చస్తామని పెట్రోల్ సీసా లాక్కుని.. తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించగా.. వారు కూడా గాయాలపాలయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. మార్కాపురం ఎస్సీబీసీ కాలనీలో నివాసం ఉండే మురారి గాలెయ్య కుమారుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. గురువారం పుట్టినరోజు కావడంతో.. స్నేహితులతో కలిసి జరుపుకునేందుకు తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో బయటకెళ్లి పెట్రోల్ సీసాతో తిరిగొచ్చాడు. పెట్రోల్ ఒంటిపై పోసుకోవడానికి సిద్దపడగా.. తండ్రి అడ్డుపడి తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.గాలెయ్య శరీరానికి మంటలు అంటుకోవడంతో భార్య లక్ష్మి, తల్లి వెంకమ్మ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...