Home /News /crime /

SON BRUTALLY MURDER FATHER IN JABALPUR PVN

Shocking : తండ్రిని గొంతుకోసి దారుణంగా చంపిన కొడుకు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Son brutally murder father:మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. పనగర్ ప్రాంతంలో ఓ యువకుడు కనికరం లేకుండా తండ్రిని హతమార్చాడు(Father Murdered By Son).గొంతుకోసి తండ్రిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనెలో నింపి పారవేసేందుకు వెళుతుండగా పోలీసుల చెకింగ్‌లో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
Son brutally murder father:మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. పనగర్ ప్రాంతంలో ఓ యువకుడు కనికరం లేకుండా తండ్రిని హతమార్చాడు(Father Murdered By Son).గొంతుకోసి తండ్రిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గోనెలో నింపి పారవేసేందుకు వెళుతుండగా పోలీసుల చెకింగ్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పనగర్‌లో నివసించే రాంలాల్ వంశ్‌కర్ వాహన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు, అయితే అతను తన ఆదాయాన్ని కుటుంబానికి బదులుగా మద్యానికి ఖర్చు చేస్తున్నాడు. అంతే కాదు మద్యం సేవించి భార్యాపిల్లలను దుర్భాషలాడడం, కొట్టడం అతడికి నిత్య అలవాటుగా మారింది. చాలా ఏళ్లుగా ఆ కుటుంబం రాంలాల్ అకృత్యాలను సహిస్తూనే ఉంది, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. కొన్ని రోజుల క్రితం, రాంలాల్ భార్య తన చిన్న కుమార్తెతో జబల్‌పూర్‌లోని గధాలోని తన తల్లి ఇంటికి వచ్చింది. ఇంట్లో కొడుకు అమన్, మరో కొడుకు ఉన్నారు. సోమవారం రాత్రి రాంలాల్ మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న భార్య, పిల్లలను వేధించాడు. 24 ఏళ్ల కొడుకు అమన్ అన్నీ వింటూ నిద్రలోకి జారుకున్నాడు, అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిద్రలేచి తన తండ్రిని బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేశాడు. గొంతుకోసి తండ్రిని హత్య చేసిన తర్వామృతదేహాన్ని గోనెలో నింపి పారవేసేందుకు వెళుతుండగా పోలీసుల చెకింగ్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన అమన్ ను పోలీసులు అరెస్ట్ చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.



Uddhav Thackeray resigns : సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా

మరోవైపు,మధ్యప్రదేశ్ లో 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మామిడికాయలు తినిపిస్తానని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలోని సెమారియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రేవా జిల్లాలోని సెమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని తన మేనమామ ఇంటికి తల్లితో కలిసి వచ్చింది బాలిక. సోమవారం సాయంత్రం బాలిక తన తల్లితో కలిసి ఆడుకుంది. అదే సమయంలో పొరుగింట్లో నివసించే నిందితుడు రాజేంద్ర సాకేత్..బాలికను ఇంటికి చేరుకున్నాడు మామిడి పళ్లు తినిపిస్తానని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లి..పసిబిడ్డ అని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవడంతో బాలిక అత్త ఆమెను తీసుకెళ్లేందుకు పక్కింటి యువకుడి ఇంటికి చేరుకుంది. అక్కడ రాజేంద్ర.. బాలికపై చేస్తున్న దారుణం చూసి షాక్ అయింది. కొంతసేపటికి బాలిక తల్లి కూడా అక్కడికి చేరుకుంది. రాజేంద్రను చితకబాది బాలికను అక్కడినుంచి తీసుకెళ్లారు. రాజేంద్రపై బాలిక కుటుంబసభ్యులు మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు మహిళా స్టేషన్‌ ఇన్‌చార్జి నిషా మిశ్రా తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Madhya pradesh, Son kills father

తదుపరి వార్తలు